మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల కొత్త ఎత్తుగడ... మరోమారు మహాకూటమి?

By telugu teamFirst Published Jan 18, 2020, 12:39 PM IST
Highlights

2018 డిసెంబర్ ఎన్నికల్లో తెరాస చేతిలో ఘోర పరాజయం పొందక మహాకూటమి నేదాన్ని తెలంగాణలోని విపక్షాలు పక్కకు పెట్టేశాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆ ఊసే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మరో మారు ఈ పేరు మనకు వినబడుతుంది. 

2018 డిసెంబర్ ఎన్నికల్లో తెరాస చేతిలో ఘోర పరాజయం పొందక మహాకూటమి నేదాన్ని తెలంగాణలోని విపక్షాలు పక్కకు పెట్టేశాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆ ఊసే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మరో మారు ఈ పేరు మనకు వినబడుతుంది. 

ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లో ఒక మూడు జిల్లాలకు సంబంధించి టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్ లు ఒక అనధికారిక, అప్రకటిత పొత్తు కుదుర్చుకున్నారు. ఇది కూడా పూర్తిగా అన్ని మునిసిపాలిటీలకు, వార్డులకు అనుకునేరు... కేవలం అక్కడి స్థానిక పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలాధారంగా వారు ఒక ఒప్పందానికి వస్తున్నారు. 

Also read: కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం

ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి వారి మధ్య ఈ అవగాహన కుదిరినట్టు మనకు అర్థమవుతుంది. జనవరి 22న రాష్ట్రంలోని 130 మునిసిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పార్టీల మధ్య ఈ ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. 

ఉదాహరణకు గనుక వైరా మునిసిపాలిటీల్లో గనుక తీసుకుంటే... కాంగ్రెస్ కేవలం 10 వార్డుల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ కేవలం 6 వార్డుల్లోని పోటీలు చేస్తుంది. సిపిఐ కేవలం ఒక్క వార్డులోనే పోటీ చేస్తుంది. ఇలా వారు ఒక అవగాహనకు వచ్చి అధికార పార్టీని అధికార పీఠానికి దూరంగా ఉంచాలని చూస్తున్నార

కొన్ని చోట్ల సిపిఎం కూడా వీరికి కలిసి వస్తుండడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో మున్సిపాలిటీ మధిరలో మనకు ఇది స్పష్టంగా కనబడుతుంది. ఉన్న 22 వార్డుల్లో కాంగ్రెస్ కేవలం 10 వార్డుల్లోని పోటీ చేస్తుండగా, టీడీపీ 7 చోట్ల బరిలో ఉంది. సిపిఐ 2 చోట్ల సిపిఎం 3 చోట్ల పోటీపడుతోంది. 

Also read: మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలోనే ఇలా ప్రతిపక్షాలన్నీ ఏకమయి అధికార తెరాస కు మునిసిపల్ చైర్మన్ పదవి దక్కకుండా చేసేందుకు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. 

click me!