వికారాబాద్ జిల్లాలో వృద్ద దంపతులపై టీఆర్ఎస్ నేత దాడి: న్యాయం చేయాలని బాధితుల డిమాండ్

By narsimha lodeFirst Published Sep 20, 2022, 10:34 AM IST
Highlights

వికారాబాద్ జిల్లా పులి మామిడిలో వృద్ద దంపతులపై టీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి దాడికి దిగినట్టుగా బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 
 

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పులిమామిడి గ్రామంలో వృద్ధ దంపతులపై టీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి దాడికి దిగాడు. వృద్ద దంపతుల కొడుకు ఇంట్లో లేని సమయంలో ఈ దాడి జరిగింది., రామకృష్ణారెడ్డి భార్య గ్రామ ఎంపీటీసీ మెంబర్.

  ఈ వృద్ద దంపతులకు చెందిన భూమి చుట్టే రామకృష్ణారెడ్డి భూమిని కొనుగోలు చేసినట్టుగా బాధితుల కొడుకు మీడియాకు చెప్పారు. తమకు చెందిన మూడున్నర ఎకరాల భూమిని కూడా విక్రయించాలని తమపై ఒత్తిడి చేస్తున్నాడని  ఆరోపించారు.తాము భూమిని విక్రయించకపోవడంతో వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యుడు చెప్పినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.  తాను ఇంట్లో లేని సమయంలో రామకృష్ణారెడ్డితో పాటు ఆయనతో పాటు మరో ఇద్దరు దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు.

గతంలో కూడా తమ కుటుంబంపై రామకృష్ణారెడ్డి  వేధింపులకు పాల్పడ్డారన్నారు.  ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పలితం లేకుండాపోయిందన్నారు. తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. ఈ భూమిని విక్రయించకపోవడంతో తమను రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వృద్ద దంపతుల కొడుకు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  

గ్రామంలో గతంలో కార్లను ధ్వంసం చేసినట్టుగా ఆయనపై ఆరోపణలున్నాయని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని ఆయన కోరినట్టుగా ఈ కథనం తెలిపింది.  ఈ దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనట్టుగా బాధితుడు తెలిపారు.ఈ దృశ్యాల ఆధారంగానైనా నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

click me!