టీఆర్ఎస్ నేత అరెస్ట్.. తల్వార్లు, డమ్మీ తుపాకీతో బెదిరించి భూములు లాక్కున్న కేసులో..

By Bukka Sumabala  |  First Published Sep 15, 2022, 8:54 AM IST

డమ్మీ తుపాకులతో బెదిరించి.. భూకబ్జాలకు పాల్పడ్డ కేసులో టీఆర్ఎస్ నేత ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ మీద పరకాల సబ్ జైలుకు తరలించారు. 


వరంగల్ : తల్వార్లు, డమ్మీ తుపాకీతో బెదిరించి పలువురి నుంచి భూములు లాక్కున్న కేసులో నిందితుడైన వరంగల్ జిల్లాకు  నల్లబెల్లికి చెందిన మాజీ ఎంపీపీ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కోసం పరకాల సబ్ జైలుకు  తరలించినట్లు కేయూ ఎస్సై సంపత్  తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. 42 రోజుల క్రితం ఓ పోలీసు అధికారితోపాటు మరో ఏడుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు పాల్పడగా బాధితులు కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురిని అరెస్టు చేసి పరకాల సబ్ జైలుకు తరలించారు ఈ కేసులో సారంగపాణి హస్తం ఉన్నట్లు తేలడంతో అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

కాగా, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక టిఆర్ఎస్ నాయకుడు (ఎంపీపీ భర్త) టీ షర్టు వెనకభాగంలో బైటికి కనిపించేలా గన్ పెట్టుకున్న ఫోటో ఒరటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇటీవల ఓ కార్యక్రమంలో అందరికీ కనిపించేలా ఆయన వద్ద గన్ ఉన్న తీరు చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గంలో పలువురికి గన్ లైసెన్స్ లను ఇస్తున్నారని బిజెపి నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించిన నేపథ్యంలో ఈ ఫోటో వెలుగు చూడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Latest Videos

undefined

టీఆర్ఎస్ నేత అత్యుత్సాహం.. అందరికీ కనిపించేలా గన్ పెట్టుకుని పబ్లిక్ లో... ఫొటో వైరల్...

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఎమ్మెల్యే మాట్లాడటంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హుజురాబాద్ లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  హుజూరాబాద్ నియోజకవర్గంలో తాము విచ్చలవిడిగా గన్ లైసెన్స్ లు ఇస్తున్నాం అనేది అవాస్తవమని చెప్పారు. గత రెండేళ్లలో నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే గాని లైసెన్సులు జారీ చేశామని తెలిపారు. అందరికీ కనిపించేలా గన్ పెట్టుకుని తిరుగుతున్న నాయకుడిని హెచ్చరించానని చెప్పారు. మరోసారి ఇలా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

click me!