రేపు హైద్రాబాద్ ఇందిరాపార్క్ వద్ద రైతు సంఘాల ధర్నా: పాల్గొననున్న రాకేష్ తికాయత్

By narsimha lodeFirst Published Nov 24, 2021, 2:58 PM IST
Highlights


రైతు సంఘాల ఆందోళనల్లో భాగంగా రేపు హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో రాకేష్ తికాయత్ పాల్గొంటారు.నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొంటున్నామని ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన కొనసాగుతుందని తికాయత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 25న హైద్రాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాలో ఎస్‌కెఎం నేత రాకేష్ తికాయత్ పాల్గొంటారు.ఈ దర్ణాలో ఎస్‌కెఎం, బీకేయూఎస్  ఎకెఎంఎస్ నేతలు పాల్గొంటారు. మూడు సాగు చట్టాలకు సంబంధించి చట్ట సవరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతు ఉద్యమ అమరవీరులకు న్యాయం తదితర కీలక డిమాండ్ల సాధన కోసం రైతు  సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

also read:బీజేపీకి వరుణ్ గాంధీ మరో షాక్: వాజ్‌పేయ్ వీడియోను పోస్టు చేసిన ఎంపీ

New farm laws  వెనక్కి తీసుకొంటామని ప్రధానమంత్రి Narendra Modi  ప్రకటించారు. అయితే ప్రధానమంత్రి తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా రైతు సంఘాల నేతలు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు  ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని Rakesh Tikait  ఇటీవలనే వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు మంచివి కావని ప్రభుత్వానికి తెలియ జెప్పేందుకు తమకు ఏడాది సమయం పట్టిందని రాకేష్ తికాయత్ చెప్పారు.

 Telangana ప్రభుత్వం కూడా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతుంది. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఇదే విషయమై తాడో పేడో తేల్చుకొనేందుకు kcr ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో రాకేష్ తికాయత్ హైద్రాబాద్ కేంద్రంగా ధర్నాలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకొంది.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు, వచ్చే ఏడాదిలో పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ సహా మరికన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.తెలంగాణ రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత ఇవ్వాలని  కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.  ప్రతి ఏటా రాష్ట్రం నుండి ఎంత  ధాన్యం కొనుగోలు చేస్తారో కూడా చెప్పాలని కేసీఆర్ ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు విషయమై  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వం  నుండి ప్రకటన చేయించాలని  టీఆర్ఎస్ నాయకత్వం  బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని  డిమాండ్ చేసింది.అయితే వర్షాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలులో  టీఆర్ఎస్ సర్కార్  కొనుగోలు  చేయడం లేదని బీజేపీ  నేతలు విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు పరిశీలించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో పర్యటించిన సమయంలో రాళ్ల దాడి చోటు చేసుకొంది.  తన పర్యటనను అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ రాళ్ల దాడికి దిగిందని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని బీజేపీ ఆరోపించింది. 


 

click me!