బండా ప్రకాశ్ తో సహా ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. ఏకగ్రీవాలే..

By AN TeluguFirst Published Nov 16, 2021, 11:10 AM IST
Highlights

చివరి నిమిషంలో ఎమ్మెల్సీ కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ముందుగా నలుగురు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ప్రకటించింది. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఉన్నారు. ఆ తరువాత కొంత సమయానికి మాజీ కలెక్టర్ Venkatramireddy,  బండా ప్రకాష్ పేర్లను ప్రకటించడంతో ఈ జాబితా పూర్తయ్యింది. 

హైదరాబాద్ : శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమయ్యింది. ఆరుగురు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ప్రకటించింది. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి,  బండా ప్రకాష్ పేర్లను ఖరారు చేశారు. 

కాగా చివరి నిమిషంలో ఎమ్మెల్సీ కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ముందుగా నలుగురు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ప్రకటించింది. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఉన్నారు. ఆ తరువాత కొంత సమయానికి మాజీ కలెక్టర్ Venkatramireddy,  బండా ప్రకాష్ పేర్లను ప్రకటించడంతో ఈ జాబితా పూర్తయ్యింది. 

Banda Prakash పేరును టీఆర్ఎస్ ప్రకటించడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. బండా ప్రకాష్ ను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన  బండా ప్రకాష్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో కోటా అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. మరి కాసేపట్లో పేర్లు ప్రకటించిన అభ్యర్థులంతా ప్రగతిభవన్ కు చేరుకోనున్నారు. కాగా ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

ఇదిలా ఉండగా,  సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. TRS లో చేరారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మరోసారి MLC Electionsల సందడి నెలకొంది.  అటు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో దాదాపు అందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేయగా... తెలంగాణలో మంగళవారం అభ్యర్థులు ఫైనలైజ్ అయ్యారు. 

TRSLP Meet: నేడు సాయంత్రం టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం.. వీటిపైనే చర్చ..!

ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష సమావేశం మంగళవారం సాయంత్రం జరగనుంది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు Telangana Bhavanలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులకు సమావేశానికి ఆహ్వానం పంపారు. 

TRSLP సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉన్నది. మరోవైపు రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్యే కోటా, స్థానిక కోటా mlc elections సంబంధించి కూడా కేసీఆర్.. సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల్లో పార్టీ ఇన్‌ఛార్జుల నియామకంతోపాటు, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా ఖరారు చేయనున్నారు. ఇక, యాసంగిలో తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

click me!