
తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samiti) శాసనసభా పక్ష సమావేశం మంగళవారం సాయంత్రం జరగనుంది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులకు సమావేశానికి ఆహ్వానం పంపారు. TRSLP సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర బీజేపీ చేస్తున్న కామెంట్స్‌పై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణపై కేంద్రం వైఖరి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించే అవకాశం గురించి చర్చించనున్నట్టుగా తెలిసింది.
యాసంగి ధాన్యం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై సభ్యులకు KCR దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా.. paddy procurementపై ఢిల్లీలో ధర్నా లేదా దీక్ష చేపట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కడా కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. రాజకీయ ఎలా ముందుకు వెళ్లాలి.. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ఏ విధంగా తిప్పి కొట్టాలనే వాటిపైన కూడా సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శాసన సభ్యులకు సూచనలు చేయనున్నారు. అంతేకాకుండా కేంద్రంపై పోరాట వ్యుహాల్ని కూడా సీఎం ఖరారు చేసే చాన్స్ ఉంది.
మరోవైపు రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్యే కోటా, స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (mlc elections) సంబంధించి కూడా కేసీఆర్.. సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల్లో పార్టీ ఇన్‌ఛార్జుల నియామకంతోపాటు, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా ఖరారు చేయనున్నారు. ఇక, యాసంగిలో తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.