ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన.. జాతీయ జెండాను అవమానించారంటూ...హైదరాబాదీ పిటిషన్..!

By telugu news teamFirst Published Dec 1, 2021, 12:05 PM IST
Highlights

దేశంలోని అత్యంత పెద్ద జాతీయ జెండాలు ఐదు ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి నక్లెస్ రోడ్డులోది కూడా కావడం విశేషం. అయితే.. అక్కడ జాతీయ జెండా కోడ్ ని ఉల్లంఘించడం గమనార్హం.

మన జాతీయ జెండాను గౌరవించాల్సిన బాధ్యత పౌరుడిగా మనందరి మీదా ఉంది.  అలాంటి జాతీయ జెండాను కించ పరిచేలా చేశారంటూ.. హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. అది కూడా హైదరాబాద్ నగరంలోని ఐదు ప్రాంతాల్లో.. ఇలా జాతీయ జెండాను అవమానించారని ఆయన కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే.. దేశంలోని అత్యంత పెద్ద జాతీయ జెండాలు ఐదు ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి నక్లెస్ రోడ్డులోది కూడా కావడం విశేషం. అయితే.. అక్కడ జాతీయ జెండా కోడ్ ని ఉల్లంఘించడం గమనార్హం.

Also Read: రియాల్టర్ విజయభాస్కర్ రెడ్డి హత్య : నాటు తుపాకీ ఎక్కడా? వెలుగులోకి కొత్త కోణాలు...

 అక్కడ మాత్రమే కాదు.. సికింద్రాబాద్, నాంపల్లి, కాజీగూడ, ఎంజీ మార్కెట్లో సైతం.. జాతీయ జెండా కోడ్ ని ఉల్లంఘించడం గమనార్హం. జాతీయ జెండా పైన ఓ ప్రాంతంలో.. కిరీటం లాంటి ఆకారాలు, బల్బులు, పూలు లాంటివి ఉంచారట. అలా.. జాతీయ జెండా కన్నా ఎత్తులో.. దేనినీ ఉంచకూడదు. అయితే.. ఈ ప్రాంతాల్లో మాత్రం..  జాతీయ జెండా పైన ఇలాంటి వాటిని ఉంచారు. దీంతో.. జాతీయ జెండాను అవమానించారంటూ.. హైదరాబాద్ కి చెందిన సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్  సయ్యద్ ఆసిమ్ అహ్మద్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.

Also Read: జనం ఛీ...థూ..అంటున్నారు, ఆ సెన్సార్ భాష ఏంటీ : కేసీఆర్‌పై బండి సంజయ్ నిప్పులు

కాగా.. అతని పిటిషన్ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్.. దీనిపై చర్యలకు ఆదేశించారు. జాతీయ జెండా పైన ఎలాంటి వస్తువులను ఉంచకూడదని.. వాటిని వెంటనే తొలగించాలంటూ.. ఆదేశాలు జారీ చేశారు. 
 

click me!