ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి మెమో డిస్మిస్ చేసిన సీబీఐ కోర్టు...

By AN TeluguFirst Published Dec 1, 2021, 10:25 AM IST
Highlights

సిఆర్ పిసి సెక్షన్ 239 కింద OMC caseలో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో తాము మరిన్ని ఆధారాలు సమర్పిస్తామని ఆమె తరపు న్యాయవాది రాఘవాచార్యులు కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు అందుకు సమ్మతించలేదు.  మెమో కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి బిఆర్ మధుసూదన్రావు స్పష్టం చేశారు . అయితే, ఈ పిటిషన్లో వాదనలను కొనసాగించవచ్చని తెలిపారు. 

హైదరాబాద్ : ఓఎంసి కేసులో ఐఎఎస్ అధికారి srilakshimi దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్పై విచారణలో ఆమె కోర్టు ముందు ఉంచిన మెమోను CBI Special Court మంగళవారం తోసిపుచ్చింది. అదేసమయంలో తన అభ్యంతరాలను బలపరుస్తూ కొన్ని డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు సమర్పించేందుకు అనుమతి ఇవ్వడానికి కూడా నిరాకరించింది.

సిఆర్ పిసి సెక్షన్ 239 కింద OMC caseలో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో తాము మరిన్ని ఆధారాలు సమర్పిస్తామని ఆమె తరపు న్యాయవాది రాఘవాచార్యులు కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు అందుకు సమ్మతించలేదు.  మెమో కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి బిఆర్ మధుసూదన్రావు స్పష్టం చేశారు . అయితే, ఈ పిటిషన్లో వాదనలను కొనసాగించవచ్చని తెలిపారు. అనంతరం, కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా, నవంబర్ 13న ఓబులాపురం మైనింగ్ కంపెనీ  Illegal mining caseలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదానికి సంబంధించి సిఆర్ పిసి సెక్షన్ 173  ప్రకారం CBI తుది నివేదిక ఇచ్చేవరకు తనపై నమోదైన కేసుల విచారణను నిలిపివేయాల్సిందిగా హైదరాబాదులోని సిబిఐ ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ డివై చంద్ర చూడ్,  జస్టిస్ ఏఎస్‌ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో  ఇదే అభ్యర్థనతో  శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

నేటినుండే ఏపీలో జూడాల సమ్మె... నల్ల బ్యాడ్జీల నుండి ఎమర్జెన్సీ సేవల బంద్ వరకు

కాగా, అంతకుముందు సెప్టెంబర్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. గురువారం సెప్టెంబర్ 23న సీబీఐ, ఈడీ కోర్టు jagan case పై విచారణ జరిపింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ వారెంట్‌ను సెప్టెంబర్ 30లోగా అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఇదే  కేసులో సీఎం వైఎస్ జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. పెన్నా కేసులో విశ్రాంత ఐఏఎస్‌ జి.వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఎన్‌బీడబ్ల్యూను న్యాయస్థానం రీకాల్‌ చేసింది. 

అంతకు ముందు జూలై, 2021లో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని రాతపూర్వకంగా సీబీఐ కోర్టులో మెమోలు దాఖలు చేయాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు జూలై 9, శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఈ కేసులో నిందుతురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టును ఆదేశించింది.

click me!