ఆసిషాబాద్ కొమరం భీమ్ జిల్లా రౌటసంకేపల్లిలో పోడు భూముల విషయమై గిరిజన రైతులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.తమ సమస్య పరిష్కరించే వరకు తాము ఆందోళన విరమించబోమని ప్రకటించారు గిరిజన రైతులు.
ఆదిలాబాద్: Asifabad కొమరం భీమ్ జిల్లాలోని Route Sankepallyలో పోడు భూముల విషయమై గిరిజన రైతులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్య పరిష్కరించే వరకు అధికారులను గ్రామం దాటకుండా అడ్డుకుంటామని గిరిజనులు తేల్చి చెప్పారు.
రౌటసంకేపల్లిలో పట్టాలున్నవారిని కూడా సేద్యం చేసుకోకుండా Forest అధికారులు అడ్డుకుంటున్నారని Tribes ఆరోపిస్తున్నారు.ఈ విషయమై రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లు పెట్టి ఈ నెల 27న నిరసనకు దిగారు. ఇవాళ ఉదయం 9 గంటల వరకు అధికారులకు సమయం ఇచ్చారు. ఇవాళ ఉదయం 9 గంటల వరకు అధికారులు తమ సమస్య పరిష్కరించకపోవడంతో Podu భూములతో పాటు పట్టా భూముల్లో కూడా గిరిజన రైతులు విత్తనాలు వేశారు. గిరిజన రైతులు విత్తనాలు వేసిన తర్వాత గ్రామానికి రెవిన్యూ, పోలీస్, ఫారెస్ట్ అధికారులు వచ్చారు.
undefined
దీంతో గిరిజన రైతులు అధికారులతో చర్చించారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కూడా గిరిజనులు డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ పై అధికారుల నుండి సానుకూలంగా స్పందన రాలేదు. మరో వైపు పట్టా భూముల్లో కూడా సేద్యం చేసుకోకుండా అడ్డుపడడంపై గిరిజన రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గిరిజన రైతులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. గ్రామం నుండి అధికారులను గిరిజనులు కదలకుండా అడ్డుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరజనులపై అటవీశాఖాధికారులు ఈ నెల 26న దాడికి దిగారు. ఈ దాడితో గిరిజనులు ఇతర ప్రాంతానికి వెళ్లారు. గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు బెల్ట్ లతో దాడి చేయడం వివాదాస్పదంగా మారింది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో చంద్రుగొండ మండలం ఎర్రబోడులో గిరిజనులు పోడు భూములు సాగు చేసుకొంటున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన గిరిజనులు నివాసం ఉంటున్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేసుకుంటున్నారు. దాదాపుగా 15 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు అటవీశాఖాధికారుల మధ్య ఘర్షణలు సాగుతున్నాయి.
also read:భద్రాద్రిలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడి: మహిళలను బెల్ట్‌తో కొట్టిన అధికారులు
చంద్రుగొండ మండలం ఎర్రబోడులో పోడు భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. . ఇవాళ కూడా పోడు భూముల్లో వ్యవసాయం చేసేందుకు వెళ్లిన గిరిజనులపై Forest అధికారులు బెల్ట్ లతో దాడికి దిగారు.వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులపై అటవీ శాఖాధికారులు Attack చేసినట్టుగా ప్రముఖ న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. గిరిజనులను అటవీశాఖాధికారులు తరిమి తరమి కొట్టారని కూడా ఆ కథనంలో వివరించింది.
తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా గిరిజనులపై అటవీశాఖాధికారులు దాడులు చేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.పోడు భూముల్లో వ్యవసాయం చేయకుండా అటవీశాఖాధికారులు చేసే ప్రయత్నాలను కూడా గిరిజనులు అడ్డుకుంటున్న పరిస్థితులు కూడా లేకపోలేదు. కొన్ని జిల్లాల్లో అటవీశాఖాధికారులపై గిరిజనులు దాడులకు దిగిన కేసులు కూడా నమోదయ్యాయి.పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలు, ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.