బీజేపీ‌ ‘ఫ్లెక్సీకి ’ హైదరాబాద్‌లో చోటు కరువు.. కేసీఆర్ వ్యూహం, తలపట్టుకుంటున్న కమలనాథులు

Siva Kodati |  
Published : Jun 28, 2022, 03:34 PM ISTUpdated : Jun 28, 2022, 03:37 PM IST
బీజేపీ‌ ‘ఫ్లెక్సీకి ’ హైదరాబాద్‌లో చోటు కరువు.. కేసీఆర్ వ్యూహం, తలపట్టుకుంటున్న కమలనాథులు

సారాంశం

హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ ఆ పార్టీకి షాకిచ్చారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. భాగ్యనగరంలో బీజేపీకి ఫ్లెక్సీలు కట్టకుండా మొత్తం గులాబీమయం చేసేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) రాకను పురస్కరించుకుని హైదరాబాద్ ను కాషాయమయం చేద్దామనుకుంది బీజేపీ (bjp) . అయితే అప్పటికే గులాబీ రంగుతో నింపేసింది టీఆర్ఎస్ (trs) . ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ జాతీయ వర్గాల సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తుండటంతో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని భావించారు కమలనాథులు. అయితే వాళ్లకి ఎక్కడా ప్లేస్ దొరక్కుండా మెట్రో పిల్లర్లు, బస్టాప్ లు, హోర్డింగ్ లను ప్రభుత్వ పథకాలతో కూడిన ప్రకటనలతో నింపేసింది అధికార టీఆర్ఎస్. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (bjp national executive meeting) జరుగుతున్న వేళ.. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కనిపించేలా టీఆర్ఎస్ వ్యుహాలు రచించింది. నగరంలో టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉండేలా ప్లాన్ చేసింది. అంతేకాకుండా మెట్రో పిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలిపేలా  ప్రకటనలతో నింపేసింది. హోర్డింగ్స్‌లో కేసీఆర్ ఫొటో ఉండేలా.. రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి, రైతు భీమా తదితర పథకాలను ప్రచారం చేయనుంది. ఇందుకోసం.. ఎల్ అండ్ టీ, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ‌లతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రోజులతో పాటు.. అందుకు ముందు, వెనకాల రెండు రోజుల్లో(మొత్తం వారం రోజులు)  తమ ప్రకటనల కోసం ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని తెలుస్తోంది. మరోవైపు నగరంలోని బస్టాప్‌లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

ALso REad:బీజేపీ‌కి షాకిచ్చిన టీఆర్ఎస్.. మోదీ హైదరాబాద్‌కు వస్తున్న వేళ కేసీఆర్ మార్క్ ప్లాన్‌తో కౌంటర్..!

తెలంగాణ అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే తాము తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేసేలా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది. జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా జూలై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. దీంతో హైదరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం సాగించాలని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఏ పార్టీ అయినా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తుంటాయి. అయితే బీజేపీకి టీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu