ఫించన్ ఇమ్మంటే.. సినిమాకొస్తావా.. అంటూ లైంగిక వేధింపులు...

Published : Dec 10, 2021, 09:19 AM ISTUpdated : Dec 10, 2021, 09:20 AM IST
ఫించన్ ఇమ్మంటే.. సినిమాకొస్తావా.. అంటూ లైంగిక వేధింపులు...

సారాంశం

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్డ్‌ అయిన ఓ యువతి తండ్రి ఇటీవల మరణించడం... అంతకుముందే తల్లి కూడా చనిపోవడంతో యువతి అనాథగా మారింది. దీంతో తండ్రికి వచ్చే పింఛన్ తనకు మంజూరు చేయాలని కోరగా తనతో సినిమాకు వస్తేనే  పింఛను మంజూరు చేస్తానంటూ  అక్కడ అదనపు ట్రెజరీ అధికారి(ఏటీవో) గా  పనిచేస్తున్న పవన్ కుమార్ ఆ యువతిని లైంగికంగా వేధించాడు  

మేడ్చల్ :  తండ్రి Pension తనకు మంజూరు చేయాలని కోరుతూ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఓ యువతిని తనకున్న అధికారంతో లోబరుచుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. సదరు యువతి పట్ల Rudeగా ప్రవర్తించాడు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించాడు ఆ అధికారి. నాలుగు రోజుల క్రితం Medical Treasury Officeలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి…

బాధిత యువతి కథనం ప్రకారం.. నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి తండ్రి Government teacherగా పని చేసి రిటైర్డ్‌ అయ్యి పింఛనును తీసుకుంటున్నారు. అయితే ఇటీవల అతను మరణించడం... అంతకుముందే తల్లి కూడా చనిపోవడంతో యువతి అనాథగా మారింది. దీంతో తండ్రికి వచ్చే పింఛన్ తనకు మంజూరు చేయాలని కోరుతూ నాలుగు నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది.  

అయితే, తనతో Cinemaకు వస్తేనే  పింఛను మంజూరు చేస్తానంటూ  అక్కడ అదనపు ట్రెజరీ అధికారి(ఏటీవో) గా  పనిచేస్తున్న పవన్ కుమార్ ఆ యువతిని 
Sexually harassed చేశాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో సదరు అధికారి అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు.  విషయాన్ని అక్కడి అధికారులకు, టిఆర్ఎస్ నాయకులకు చెప్పగా ఏటీవోకు యువతికీ మధ్య రాజీకి ప్రయత్నించారు తప్ప అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు.

అంతా అబద్ధం..
యువతికి వివాహం కాలేదు అని చెబుతూ పింఛన్ పొందాలని చూసిందని.. కానీ నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తును తిరస్కరించి రికవరీకి ఆదేశాలు ఇవ్వడంతోనే ఆ యువతి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఏటీవో పవన్ కుమార్ వివరణ ఇచ్చారు.

Telangana: తెలంగాణాలో పెరిగిన ఆత్మహత్యలు.. NCRB నివేదికలో షాకింగ్ విష‌యాలు !

ఇదిలా ఉండగా, ఢిల్లీలో గతనెల 26న కదులుతున్న కారులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. దేశ రాజధాని న్యూడిల్లీలో నిర్భయ ఘటన మాదిరిగానే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగుచూసింది. ఎస్సై పరీక్ష రాసి వస్తున్న యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్న దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కదులుతున్న కారులోనే యువతిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. uttar pradesh state రాష్ట్రంలోని మథురకు చెందిన 21ఏళ్ల యువతి పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల యూపీ ప్రభుత్వం ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేసుకుంది. నియామక ప్రక్రియలో భాగంగా గత మంగళవారం రాతపరీక్షకు హాజరయ్యింది. ఆగ్రాలో పరీక్షా కేంద్రం వుండటంతో ఒంటరిగానే వెళ్లింది. 

పరీక్ష రాసి తిరిగివస్తున్న క్రమంలో యువతికి సోషల్ మీడియా స్నేహితుడు తేజ్ వీర్ తారసపడ్డాడు. తన కారులో ఇంటికి దింపుతానని అతడు కోరడంతో నమ్మిన యువతి కారెక్కింది. అయితే అప్పటికే కారులో తేజ్ వీర్ తో పాటు దిగంబర్ అనే మరో యువకుడు వున్నాడు. 

నమ్మి కారెక్కిన యువతిపై కదులుతున్న కారులోనే తేజ్ వీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దిగంబర్ కారు డ్రైవింగ్ చేస్తుండగా వెనకసీట్లో యువతిపై తేజ్ వీర్ అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం యువతిని మథుర శివారులోని కోసి కలాన్‌ వద్ద వదిలి వెళ్లిపోయారు. 

ఇంటికివెళ్ళిన తర్వాత తనపై జరిగిన అఘాయిత్యం గురించి యువతి సోదరుడికి తెలిపగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత యువతి తెలిపిన వివరాల మేరకు నిందితుల ఆఛూకీ గుర్తించారు. నిందితులిద్దరూ హరియానాకు చెందినవారిగా గుర్తించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు