తెలంగాణ (Telangana)లో కొత్తగా 201 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 184 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,887 యాక్టివ్ కేసులు వున్నాయి
తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో వైరస్ (corona deaths in telangana) వల్ల ఒకరు మృతి చెందగా... 184 మంది కోరనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.83 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 3,887 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 312 మంది వచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,77,747కి చేరింది. అలాగే వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,69,857కి చేరుకుంది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 76, జగిత్యాల 5, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 2, ఖమ్మం 9, మహబూబ్నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 4, మంచిర్యాల 3, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 1, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 11, నారాయణపేట 1, నిర్మల్ 2, నిజామాబాద్ 2, పెద్దపల్లి 4, సిరిసిల్ల 0, రంగారెడ్డి 24, సిద్దిపేట 6, సంగారెడ్డి 4, సూర్యాపేట 3, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 2, హనుమకొండ 15, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.
Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.09.12.2021 at 5.30pm) pic.twitter.com/ZrRvnO79hH