జూన్ 1న పాఠశాలలు తెరవడానికి ట్రస్మా ససేమిరా

First Published May 30, 2018, 6:11 PM IST
Highlights

తెలంగాణ సర్కారుకు ఝలక్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకల్లో విద్యార్థులు సైతం పాల్గొనాలనే ఉద్దేశ్యంతో 2018-19 విద్యా సంవత్సరాన్ని జూన్ 1 వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించింది. గతంలో జూన్ 12 వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేది. అప్పటి వరకు రుతుపవనాలు వచ్చి వాతావరణం చల్లబడేది. కానీ ఈ సంవత్సరం ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా వున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలని నిర్ణయించింది. 
దీనికై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు. వేసవి సెలవులు పొడిగించాలని బాలల హక్కుల సంఘం HRC కి పిటీషన్ కూడా సమర్పించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా సెలవుల విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాయి. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాజమాన్యాలు ఉపాధ్యాయులు, అందుబాటులో ఉన్న విద్యార్థులతో కలిసి వేడుకలు ఘనంగా నిర్వహించాలని తీర్మానించడమైనదని ట్రస్మా ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

click me!