రంగారెడ్డి జిల్లా చిన్నారి హత్య కేసులో తల్లిదండ్రులే నిందితులు

Published : May 30, 2018, 05:42 PM IST
రంగారెడ్డి జిల్లా చిన్నారి హత్య కేసులో తల్లిదండ్రులే నిందితులు

సారాంశం

చిన్నారి మానసిక స్థితి బాగాలేకపోవవడంతోనే హత్య

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింత పల్లిలో జరిగిన ఏడేళ్ల చిన్నారి ఊర్వశి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేదించారు. మొదటి నుండి అనుమానిస్తున్నట్లే ఆ పాప తల్లిదండ్రులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మానసిక స్థితి బాగాలేకపోవడంతోనే వారు తమ కన్న కూతరుని గొంతు నులిమి చంపి, వరి పొట్టులో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంగా రెడ్డి జిల్లా యాచారం మండలం చింత పల్లిలోని ఓ ఇటుక బట్టీలో పనిచేయడానికి ఒడిషా నుండి కొందరు కూలీలు వలస వచ్చారు. వీరిలోని ఓ కుటుంబంలోని ఊర్వశి అనే చిన్నారి మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిన్న ఈ బాలిక మృత దేహం ఇటుక బట్టీ పక్కన ఉన్న వరి పొట్టులో పాప తల్లికి కనిపించింది. దీంతో వీరు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.

అయితే పాప మానసిక వికలాంగురాలు కావడంతో తల్లిదండ్రులే పాపను చంపి ఉంటారని పోలీసులు మొదటి నుండి అనుమానిస్తున్నారు. అయితే లోతుగా విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. పాపతో పాటు ఆమె అక్క కూడా మానసిక వికలాంగురాలు కావడంతో వారిని వదిలించుకోవాలనుకున్న తల్లిదండ్రులు మొదట ఈ పాపను గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది. 

దీంతో ఈ దారుణానికి పాల్పడిన పాప తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్