తొలిసారి గాంధీభవన్ లో అడుగు పెట్టిన నాగం.. కేసిఆర్ పై ఫైర్

First Published May 30, 2018, 5:45 PM IST
Highlights

హాట్ న్యూస్..

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి నాగం జనార్దన్ రెడ్డి గాంధీభవన్ లో కాలు పెట్టారు. ఆయన గాంధీభనవ్ లో మీడియాతో మాట్లుడుతూ తెలంగాణ సిఎం కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన ఏం మాట్లాడారో చదవండి.

కాంగ్రెస్ వి ఆపదమొక్కులు కావు..రైతును సంక్షోభం నుండి కాపాడాలనే లక్ష్యం. రేపు అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ చేస్తుంది. టీఆరెస్ కు అసాధ్యం కావొచ్చు ..కాంగ్రెస్ దాన్ని సాధ్యం చేసి చూపిస్తుంది. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ హామీలు కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రైతులను మోసం చేసింది కేసీఆరే. కేసీఆర్ చేసిన రుణమాఫీ తో  రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోయారు. పంటకు మద్దతు ధరలేక రైతు ఎకరాకు 22వేలు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 4వేల పెట్టుబడి ఏ మూలకు సరిపోదు. కౌలు రైతులకు కూడా పంటకు పెట్టుబడి సాహయం అందించాలి.

కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేస్తాం. నేను ఎక్కడి నుండి పోటీచేసేది అధిష్టానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ తోనే కేసీఆర్ అవినీతిని బయటపెడతానని నమ్ముతున్న. దామోదర్ రెడ్డి తో కలిసి పనిచేస్తా. జోనల్ వ్యవస్థ లో లోపాలు ఉన్నాయి.

పత్తి వేసుకోవద్దు...మొక్కజొన్న వేసుకోవాలని టామ్ టామ్ చేసింది నిజామా కాదా ? మిమ్మల్ని నమ్మి రైతులు మొక్కజొన్న పంట వేశారు. మొక్కజొన్న ఎండిపోతే కరువు మండలాలు ప్రకటించలేదు. వేరుశనగ పంటలో క్వింటాలుకు 12వందలు నష్టపోతున్నారు. ఇంత నష్టపోతుంటే 4వేలు ఏడ ఆదుకుంటున్నాయి. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ పై ప్రజలకు విశ్వాసముంది. అవినీతిని రూపుమాపుతాం...రెండు లక్షల రుణమాఫీ ఒక్కదఫాలోనే చేసి చూపిస్తాం. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ కోరుతుంది. టిఆర్ఎస్, కెసిఆర్ అవినీతిని బయట పెట్టేందుకే కాంగ్రెస్ లో చేరాను. అంతే కానీ టికెట్ కోసం, సీట్లకోసం కాదు. అందరం కలిసే పనిచేస్తాం, ఎవ్వరితో విభేదాలు లేవు. నా ప్రధాన శత్రువు టిఆర్ఎస్ పార్టీనే. తెలంగాణ కోసం బీజేపీ లో చేరుతున్నాను అని బీజేపీ లో చేరెప్పుడే చెప్పాను. జోనల్ వ్యవస్థ సైన్టిఫిక్ గా జరగలేదు.

tags
click me!