విషాదం.. పెన్ గంగాలో పడి యువకుడు మృతి.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

By Asianet News  |  First Published Apr 17, 2023, 9:37 AM IST

పెన్ గంగాలో పడి ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. శనివారం పెన్ గంగా నది పక్కన ఉన్న చేన్లోకి వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు పెన్ గంగాలో మృతదేహం లభించింది. 


విషాదం.. పెన్ గంగాలో పడి యువకుడు మృతి.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన 

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెన్ గంగాలో పడి సిర్పూర్ - టి లోని హుడ్కి గ్రామానికి చెందిన యువకుడు మరణించాడు. దీంతో ఆ గ్రామం మొత్తం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Latest Videos

స్వలింగ వివాహం అనేది దేశ సామాజిక విలువలకు దూరంగా ఉన్న ‘అర్బన్ ఎలిటిస్ట్ కాన్సెప్ట్’- సుప్రీంకోర్టుతో కేంద్రం

వివరాలు ఇలా ఉన్నాయి. సిర్పూర్ - టి లోని హుడ్కి గ్రామానికి చెందిన 25 ఏళ్ల చౌదరి కైలాస్ కొంత కాలం నుంచి మతిస్థిమితం బాగా లేదు. దీంతో పాటు ఆయనకు అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తుంటాయి. అయితే ఈ నెల 15వ తేదీన ఆయన పెన్ గంగాను ఆనుకొని ఉన్న చేన్లోకి వెళ్లారు. కానీ చీకటి పడినా తిరిగి ఇంటికి రాలేదు. 

దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేన్లో, పెన్ గంగా పరిసరాల్లో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం పెన్ గంగా నది ఒడ్డున చెప్పులు కనిపించాయి. దీంతో నదిలో గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయం తరువాత కైలాస్ మృతదేహం లభించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ దూకుడు.. మరో బహిరంగ సభకు సిద్దం.. ముహూర్తం ఫిక్స్..

ఇలాంటి ఘటనే మూడు రోజుల కిందట తమిళనాడులో చోటు చేసుకుంది. సేలం జిల్లా సంగకరగిరి మండలం కల్వదంగం గ్రామం వద్ద ఈ నెల 13వ తేదీన కావేరి నదిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. మృతులను సేలంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఎం.మణికందన్ (20), ఎం.సెల్వం (20), మణికందన్ (20), పాండ్యరాజన్ (20)గా గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కావేరీ నదిలో స్నానం చేసేందుకు 15 మంది కళాశాల విద్యార్థుల బృందం గురువారం కల్వదంగం చేరుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ విద్యార్థి నదిలోకి దిగి చిక్కుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ముగ్గురు స్నేహితులు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో నీటి ప్రవాహం వేగం ఎక్కువగా ఉంది. దీంతో వారు అందులోనే మునిగిపోయారు. ఈ నలుగురికి ఈత రాకపోవడంతో బయటకు రాలేక చనిపోయారు. 

వడగాలుల కారణంగా బెంగాల్‌లో 24వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలు బంద్

ఈ ఘటనపై మిగతా విద్యార్థులు గ్రామస్తులకు సమాచారం. వారంతా అక్కడికి తరలివచ్చారు. కొంత సమయం తరువాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా సంతాపం వ్యక్తం చేశారు. 

click me!