మెదక్ జిల్లాలో విషాదం.. అక్క పెళ్లికి ముందు రోజుకు చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో కనిపించిన తమ్ముడు..

Published : Oct 24, 2021, 01:08 PM IST
మెదక్ జిల్లాలో విషాదం.. అక్క పెళ్లికి ముందు రోజుకు చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో కనిపించిన తమ్ముడు..

సారాంశం

కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్క పెళ్లికి ముందు రోజు తమ్ముడు శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా (Medak District) తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఇళ్లంతా పెళ్లి సందడి నెలకొంది. అక్క పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి తమ్ముడు అన్ని పనులు పూర్తి చేశాడు. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు పొలంలో ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా (Medak District) తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్రెడ్డిపల్లికి  చెందిన మన్నె సుధాకర్, అరుణ దంపతులకు కూతురు అనూష, కొడుకు నవీన్ ఉన్నారు. సుధాకర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అరుణ పొలం పనులకు వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. కొద్ది రోజుల కిందట సుధాకర్ కూతరు అనూష‌కు పెళ్లి కుదిరింది. ఆదివారం (అక్టోబర్ 24) రోజున పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేశారు. 

అనూష పెళ్లి‌ పనుల్లో  కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. తల్లిదండ్రులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అక్క పెళ్లి కోసం తమ్ముడు నవీన్ కూడా పనులు చేయసాగాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి పెళ్లి పనులు చేస్తూ తల్లిదండ్రులకు సాయంగా  నిలిచాడు. అయితే శుక్రవారం రాత్రి బయట పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. శనివారం తెల్లారేసరికి కూడా నవీన్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన నవీన్ కుటుంబ సభ్యులు.. అతని ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నవీన్ సొంత పొలంలోనే ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. ఇది చూసిన నవీన్ తల్లిదండ్రులు,  అక్క సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బంధువులను, స్థానికులను కలచివేసింది. 

Also read: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. సోమవారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్స్‌లో వెళ్లే వారికి అలర్ట్..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేపట్టారు. ప్రేమ విఫలం కావడంతోనే నవీన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu