డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్: రేవంత్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Oct 24, 2021, 12:29 PM IST

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ కు వచ్చిన  ఆయన మీడియాతో మాట్లాడారు.


కరీంనగర్:  తెలంగాణ డీజీపీ  Mahender Reddy  ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఇక్కడకు వచ్చిన ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. పోలీస్ శాఖ రెండు చీలిపోయిందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్,  మాజీ మంత్రి ఈటల రాజేందర్  మధ్య ఆదిపత్య పోరు వల్లే Huzurabad bypoll  వచ్చిందన్నారు.

also read:హుజురాబాద్ ఎన్నికలయ్యాక కాంగ్రెస్ లోకి ఈటల... కేటీఆర్ కామెంట్స్ పై భట్టి క్లారిటీ

Latest Videos

undefined

Trs, Bjpలు కలిసి తెలంగాణ పరువును దిగజారుస్తున్నాయని ఆయన విమర్శించారు. మా అభ్యర్ధి బల్మూరి వెంకట్ అనామకుడైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు  కూడా అనామకులేనని ఆయన చెప్పారు. ఎన్నికల పిరాయింపులతోనే తెలంగాణ రాజకీయం నడుస్తుందని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ ,సుగంధాలపై కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తుంటే 
ప్లీనరీ పేరుతో కేటీఆర్ వంటకాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ఉద్యమాల గడ్డ తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందన్నారు.  టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారన్నారు. నిజాం నవాబు దారుల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని ఆరోపించారు.బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని Revanth Reddy విమర్శించారు.  petrol, Diesel ధరలు అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించాలన్నారు. త్వరలో టీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేయడంతో  ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ నెల 30 హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.ఈ స్థానం నుండి ఈ దఫా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి పోటీ చేశాడు.కౌశిక్ రెడ్డి ఇటీవలనే టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో  కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు లభించాయి.

click me!