విషాదం.. మట్టి గోడ కూలి ముగ్గురు మృతి.. హన్మకొండ జిల్లాలో ఘటన

By Asianet NewsFirst Published Sep 23, 2023, 6:55 AM IST
Highlights

పురాతన మట్టి గోడ కూలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలోని శాయంపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

హన్మకొండలో విషాదం చోటు చేసుకుంది. మట్టిగోడ కూలి ముగ్గురు మరణించారు. ఇందులో ఓ వ్యక్తి వేరే చోట ఉపాధి పొందుతూ..కొంత కాలం కిందటే తన ఫించను తీసుకోవడానికి ఆ ప్రాంతం నుంచి స్వగ్రామానికి అక్కడికి రాగా.. మరో ఇద్దరు మహిళలు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. ఈ ఘటన శాయంపేట మండల వ్యాప్తంగా విషాదం నింపింది. 

సస్పెన్స్‌కు చెక్.. బీఆర్ఎస్‌‌కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట మండల కేంద్రానికి చెందిన 60 ఏళ్ల పెద్ద సాంబయ్య సిరిసిల్లలో మగ్గం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తనకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ తీసుకోవడానికి ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి ఊర్లోనే ఉంటున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల  లోకలబోయిన సారలక్ష్మి, 65 ఏళ్ల భోగి జోగమ్మ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరిద్దరూ వితంతవులు. 

ఈ దేశంలో ఆడవారికి రక్షణ లేదా..? కాబోయే భర్త కళ్ల ముందే యువతి గ్యాంగ్ రేప్.. ఆపై..

కాగా.. వీరు ముగ్గురు శుక్రవారం ఉదయం ఎవరికి వారు నిత్యవసరాల వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కిరాణా షాప్ నకు సమీపంలో ఓ పురాతన మట్టి గోడ ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోడ దెబ్బతింది. అయితే వీరు ఆ గోడ వెంట నడుస్తున్న సమయంలో ఒక్క సారిగా అది కూలిపోయింది. దీంతో దాని కింద ఈ ముగ్గురూ చిక్కుకున్నారు.

KTR: 'ఆ పరిస్థితి ఉహించుకుంటేనే వణుకుపుడుతోంది' : బీజేపీ ఎంపీ ప్రవర్తనపై మంత్రి కేటీఆర్‌ ఫైర్

దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇందులో సారలక్ష్మి, పెద్దసాంబయ్యకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అలాగే గాయాలపాలైన జోగమ్మను అంబులెన్స్ ద్వారా పరకాల గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయారు. దీనిపై సమాచారం అందిన వెంటనే ఎస్ ఐ దేవేందర్ అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన మూడు కుటుంబాలతో పాటు మండల వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

click me!