నిన్న మియాపూర్.. నేడు కూకట్‌పల్లి , వాహనదారులపై చేయిచేసుకుంటోన్న ట్రాఫిక్ పోలీసులు

By Siva Kodati  |  First Published Aug 4, 2022, 6:16 PM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోతున్నారు. వాహనదారులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి చేసుకుంటున్నారు. వరుస సంఘటన నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


పేరుకేమో ఫ్రెండ్లీ పోలీసింగ్.. సామాన్యులను చితకబాదడమే పనిగా పెట్టుకున్నారు హైదరాబాద్‌లో కొందరు ట్రాఫిక్ పోలీసులు. వీరి ఓవరాక్షన్‌కు యావత్ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరొస్తోంది. నిన్న మియాపూర్‌లో పోలీస్ ఇన్స్‌పెక్టర్ రెచ్చిపోతే.. ఇవాళ కూకట్‌పల్లిలో మరో ఆఫీసర్ ఓవరాక్షన్ చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వాహనదారులపై చేయి చేసుకుంటున్నారు ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్లు. అంతటితో ఆగనివారు వాహనదారులను దుర్భాషలాడటం వివాదాస్పదమైంది. సార్.. ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నానని వాహనదారులు చెబుతున్నా వినిపించుకోలేదు కూకట్‌పల్లి ఇన్స్‌పెక్టర్. చలానా కట్టి ఇక్కడి నుంచి కదలాలని రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వరుస సంఘటనలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

click me!