ఉపఎన్నికతోనే మునుగోడు అభివృద్ది.. బైపోల్‌లో గెలుపు బీజేపీదే : బండి సంజయ్

Siva Kodati |  
Published : Aug 04, 2022, 05:23 PM IST
ఉపఎన్నికతోనే మునుగోడు అభివృద్ది.. బైపోల్‌లో గెలుపు బీజేపీదే : బండి సంజయ్

సారాంశం

ఉపఎన్నిక వస్తేనే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు బీజేపీ పాలనను సమర్ధిస్తున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) , రాజగోపాల్ రెడ్డిలు (komatireddy rajagopal reddy) బీజేపీ (bjp) పాలనను సమర్ధిస్తున్నారని అన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) . ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నిక వస్తేనే మునుగోడు అభివృద్ధి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుగోడులో విజయం బీజేపీదేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు.. రాష్ట్రంలో మరో 12 మంది TRS  ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దంగా ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన భువనగిరి జిల్లాలో పాదయాత్రకు బయలు దేరే ముందు మీడియాతో చిట్ చాట్ చేశారు.ఈ చిట్ చాట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు.  ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారన్నారు.  టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పటికే 10 నుంచి 12 మంది  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై, తమ భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటున్నారన్నారు.

Also REad:మరో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దం: బండి సంజయ్ సంచలనం

KCR  కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు..దీంతో టీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి  ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. 

నయీం కేసుతోపాటు మొత్తం వ్యవహారంపై BJP  అధికారంలోకి వచ్చాక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు.నయీమ్ ను ఎన్ కౌంటర్ చేయించిందే కేసీఆర్ కుటుంబమన్నారు.. నయీం అరాచకాల వెనుక టీఆర్ఎస్ హస్తముందన్నారు. అనుకోని ఇబ్బంది రావడంతోనే నయీం ను  ఎన్ కౌంటర్ చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. . బీజేపీ ప్రభుత్వం వస్తే నయీం కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. నయీమ్ బాధితులను ఆదుకుంటామన్నారు 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?