బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్తులకు అస్వస్థత..

By Sumanth KanukulaFirst Published Aug 4, 2022, 5:32 PM IST
Highlights

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి పలువురు విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.  విద్యార్థులు తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దాదాపు 50 మంది వరకు విద్యార్థులు అస్వస్థతో ఆస్పత్రుల్లో చేరారు.

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి పలువురు విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.  విద్యార్థులు తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దాదాపు 50 మంది వరకు విద్యార్థులు అస్వస్థతో ఆస్పత్రుల్లో చేరారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్ట్ చేసింది. అయితే గతంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.. తరుచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బుధవారం రాజ్‌భవన్‌లో పలు యూనివర్సిటీల విద్యార్థి ప్రతినిధులతో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బాసరకు ఐటీకి చెందిన విద్యార్థి ప్రతినిధి బృందం కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆహారం, అడ్మినిస్ట్రేషన్ గురించి సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థుల బృందం తీసుకెళ్లింది. 

ఈ సందర్భంగా.. బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ పై గవర్నర్ Tamilisai Soundararajan ఆవేదన వ్యక్తం చేశారు.పుడ్ పాయిజన్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని గవర్నర్ చెప్పారు.  తాను మీకు ఎంత సపోర్ట్ చేయగలనో అంత మేరకు సపోర్ట్ చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. తాను  త్వరలోనే 75 కాలేజీలను సందర్శిస్తానని గవర్నర్  ప్రకటించారు. బాసర ట్రిపుల్ ఐటీని కూడా సందర్శిస్తానన్నారు.
 

click me!