ఏపీ, మహారాష్ట్రలో కరోనాకు ఉచిత వైద్యం.. తెలంగాణలో ఎందుకీ నిర్లక్ష్యం: ఉత్తమ్ ఆగ్రహం

By Siva KodatiFirst Published May 23, 2021, 3:59 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల నియంత్రణ లేదని మండిపడ్డారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఏపీ, మహారాష్ట్రల్లో ఉచితంగా కరోనా వైద్యం అందిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల నియంత్రణ లేదని మండిపడ్డారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

ఏపీ, మహారాష్ట్రల్లో ఉచితంగా కరోనా వైద్యం అందిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలు పాటించడం లేదన్నారు. 

Also Read:కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: ఉత్తమ్ డిమాండ్

అంతకుముందు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సింగారం దగ్గర మూసీనదిపై రూ. 7.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను ఉత్తమ్ పరిశీలించారు. గ్రామానికి ఎగువ భాగంలో చెక్ డ్యాం నిర్మించడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఆయన అన్నారు. కాంట్రాక్టర్, అధికార పార్టీ  నాయకుల స్వలాభం కోసమే చెక్ డ్యాం నిర్మిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చెక్ డ్యాం నిర్మాణ పనులను ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 

click me!