కరోనా నేపథ్యంలో స్మశాన వాటికల్లో పరిస్ధితులు దారుణంగా తయారయ్యాయి. గతంలో రోజుకు ఒకటి రెండు మృతదేహాలు వచ్చే చోట.. కోవిడ్ పుణ్యమా అని రోజుకు పదుల సంఖ్యలో మృతదేహాలు స్మశానానికి వస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో స్మశాన వాటికల్లో పరిస్ధితులు దారుణంగా తయారయ్యాయి. గతంలో రోజుకు ఒకటి రెండు మృతదేహాలు వచ్చే చోట.. కోవిడ్ పుణ్యమా అని రోజుకు పదుల సంఖ్యలో మృతదేహాలు స్మశానానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రంగంలోకి దిగింది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వసూలు చేయాలని శ్మశాన వాటికల వద్ద ధరలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. నగరంలోని అన్ని శ్మశాన వాటికల్లోనూ ఒకే విధంగా రుసుములు వుండాలని నిర్ణయించిన బల్దియా ఈ మేరకు చర్యలు తీసుకుంది.
undefined
Also Read:కరోనా మృత్యుఘోష... గంటల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి
సాధారణ మృతుల అంత్యక్రియలకు రూ.6 వేలు.. కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.8 వేలు వసూలు చేయాలని ఆదేశించింది. నిబంధనలు పాటించకుండా అధిక ధరలు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.