మద్యం మత్తులో తల్లితో గొడవ: చంపి ఇంట్లోనే పూడ్చేసింది

Published : May 23, 2021, 02:18 PM IST
మద్యం మత్తులో తల్లితో గొడవ: చంపి  ఇంట్లోనే పూడ్చేసింది

సారాంశం

వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో కొడుకును తల్లి హత్య చేసి ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టింది.  రామకృష్ణపురం గ్రామానికి చెందిన నాగమ్మకు  26 ఏళ్ల కొడుకు శివ ఉన్నాడు.   రోజూ మద్యం తాగి వచ్చి గొడవకు దిగేవాడు. ప్రతి రోజూ తల్లితో గొడవపడేవాడు.    

వనపర్తి:  వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో కొడుకును తల్లి హత్య చేసి ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టింది.  రామకృష్ణపురం గ్రామానికి చెందిన నాగమ్మకు  26 ఏళ్ల కొడుకు శివ ఉన్నాడు.   రోజూ మద్యం తాగి వచ్చి గొడవకు దిగేవాడు. ప్రతి రోజూ తల్లితో గొడవపడేవాడు.  

కొడుకు ఆగడాలు భరించలేక తల్లి నాగమ్మ కొడుకును హత్య చేసింది. వారం రోజుల క్రితం శివను హత్య చేసి ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టింది నాగమ్మ.  ఈ ఇంటి నుండి దుర్వాసన వస్దుండడంతో  స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు నాగమ్మ ఇంటిని ఆదివారం నాడు పరిశీలించారు.

తన కొడుకు శివను  హత్య చేసినట్టుగా ఆమె పోలీసుల విచారణలో ఒప్పుకొంది. ఇంటి ఆవరణలో తన కొడుకు మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని పోలీసులకు చూపింది. శివ మృతదేహాన్ని పోలీసులు  వెలికి తీస్తున్నారు. ఈ విషయమై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు  పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి వస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!