సమాజం తలదించుకోవాల్సిన ఘటన: అడ్డగూడూరు లాకప్‌‌డెత్‌పై ఉత్తమ్ విమర్శలు

By Siva KodatiFirst Published Jun 26, 2021, 2:24 PM IST
Highlights

దళిత మహిళ లాకప్‌డెత్ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అడ్డగూడూరులో దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో ‘‘దళిత ఆవేదన దీక్ష’’ చేపట్టారు

దళిత మహిళ లాకప్‌డెత్ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అడ్డగూడూరులో దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో ‘‘దళిత ఆవేదన దీక్ష’’ చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఘటన జరిగిన వారం తర్వాత కాంగ్రెస్ నేతలు చెబితే కేసీఆర్ స్పందించారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. దళిత ముఖ్యమంత్రి స్లోగన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మాదిగలకు మంత్రి పదవి ఏమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. 

Also Read:మరియమ్మ కొడుకుకు ఉద్యోగం: కేసీఆర్‌తో సీఎల్పీ నేత భట్టి భేటీ

మరోవైపు అడ్డగూడూరు ఘటనకు సంబంధించి సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కస్టోడియల్ డెత్ కు గురైన మరియమ్మ కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తాము చేసిన డిమాండ్ విషయమై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. మరియమ్మ కుటుంబానికి ఇల్లు కూడ ఇచ్చేందుకు సీఎం అంగీకరించారన్నారు.మరియమ్మ బిడ్డలకు ఆర్ధిక సహాయం చేయాలని తాము చేసిన వినతికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
 

click me!