కోవిడ్ స్టార్టప్స్ పై ఛాలెంజ్... విజేతగా హైదరాబాద్ కంపెనీ..!

By telugu news teamFirst Published Jun 26, 2021, 1:25 PM IST
Highlights

ఫైనల్స్ కి మొత్తం 16 స్టార్టప్స్ పోటీపడగా... వ్యాక్సిన్ లెడ్జర్ మూడో విజేతగా నిలిచింది. వ్యాక్సిన్ తయారైన దగ్గర నుంచి.. అది తీసుకునే వ్యక్తి వరకు వ్యాక్సిన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయాలను ఈ వ్యక్సిన్ లెడ్జర్ తెలియజేస్తోంది.

కోవిడ్ స్టార్టప్స్ పై యూకేలో నిర్వహించిన పోటీల్లో ఓ హైదరాబాద్ యువకుడు సత్తా చాటాడు. డేటా ఆధారిత కోవిడ్ సేవలకు సంబంధించి యూకేకి చెందిన ట్రినిటీ ఛాలెంజ్ సంస్థ ఇటీవల పోలీసులు నిర్వహించారు. ఈ పోటీల్లో గచ్చిబౌలిలో ఉన్న స్టాన్ విగ్ సంస్థకు చెందిన వ్యాక్సిన్ లెడ్జర్ స్టార్టప్ రూ.4.9 కోట్ల బహుమతి గెలుచుకుంది.

ఫైనల్స్ కి మొత్తం 16 స్టార్టప్స్ పోటీపడగా... వ్యాక్సిన్ లెడ్జర్ మూడో విజేతగా నిలిచింది. వ్యాక్సిన్ తయారైన దగ్గర నుంచి.. అది తీసుకునే వ్యక్తి వరకు వ్యాక్సిన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయాలను ఈ వ్యక్సిన్ లెడ్జర్ తెలియజేస్తోంది.

వ్యాక్సిన్‌ తయారీ నుంచి ఎయిర్‌పోర్టు, వ్యాక్సిన్‌ వెహికల్‌, స్టోరేజీ సెంటర్‌, రీజనల్‌ సెంటర్‌, సబ్‌సెంటర్‌, అంతిమంగా లబ్ధిదారుడు... ఇలా వ్యాక్సిన్‌ ప్రయాణించే ప్రతీ చోట అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంది. ఆ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ పాడవకుండా ఉందా ? లేదా ? ఇలా అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యాక్సిన్‌ లెడ్జర్‌ పని చేస్తుంది. 

ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా టీకాలను వ్యాక్సిన్‌ లెడ్జర్‌ ట్రాక్‌ చేసింది. ఎక్కడైనా ఉష్ణోగ్రత పెరిగిపోతే వెంటనే అలెర్ట్‌లు అందించింది. దీంతో పాటు చెడిపోయిన వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటిప్పుడు వ్యాక్సిన్‌ లెడ్జర్‌ తెలియజేసింది. దీంతో వ్యాక్సిన్‌ వేస్టేజ్‌ గణనీయంగా తగ్గిపోయింది

click me!