మావోయిస్టు హరిభూషణ్ భార్య మృతి..!

Published : Jun 26, 2021, 12:40 PM ISTUpdated : Jun 26, 2021, 01:10 PM IST
మావోయిస్టు హరిభూషణ్ భార్య మృతి..!

సారాంశం

హరిభూషణ్‌ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద కొద్ది రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసిన శారద.. ప్రస్తుతం డీసీఎంగా పని చేస్తోంది. 

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 24న మృతి చెందినట్లు తెలిసింది. హరిభూషణ్‌ చనిపోయిన నాలుగు రోజులకే ఆయన భార్య కూడా మరణించడంతో హరిభూషణ్‌, సమ్మక్క పుట్టిన ఊరు గంగారాంలలో విషాదం అలముకుంది.

హరిభూషణ్‌ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద కొద్ది రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసిన శారద.. ప్రస్తుతం డీసీఎంగా పని చేస్తోంది. 

కరోనాతో ఇప్పటికే పలువురు మావోయిస్టు ముఖ్యనేతలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా హరిభూషణ్‌ భార్య శారద కూడా కరోనా బారిన పడి, తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా స్వచ్ఛందంగా వస్తే వైద్య సహాయం అందజేస్తామని కరోనా బారిన పడిన మావోయిస్టుల జాబితాను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం విదితమే.  
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు