పేదోడి ఖాతాలో వేస్తాననన్న 15 లక్షలు ఎక్కడ: మోడీపై రేవంత్ విమర్శలు

By Siva KodatiFirst Published Sep 22, 2021, 2:38 PM IST
Highlights

ప్రధాని మోడీ ప్రధాని అయిన నాటి నుంచి 24 లక్షల కోట్లు ఆదాయం పొందారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. స్విస్ బ్యాంకులో దాచిపెట్టిన నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని అబద్ధాలు చెప్పిన ప్రధాని మోడీ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని రేవంత్ మండిపడ్డారు. 

పెట్రోల్ 100 రూపాయలు దాటితే.. డీజిల్ కూడా దానికి దగ్గరలోనే వుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 రూపాయల పెట్రోల్ ధరలో 65 రూపాయలు కేసీఆర్, నరేంద్రమోడీలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని రేవంత్ చెప్పారు. వాస్తవానికి లీటర్ పెట్రోల్ 35 రూపాయలేనని ఆయన తెలిపారు. పేద ప్రజల నడ్డి విరగ్గొట్టడానికి 35 రూపాయలు ఒకరు, 31 రూపాయలు మరొకరు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. పన్నుల వల్ల పేదలపై భారం పడిందని ఆయన తెలిపారు.

2014-15లో ఏడాదికి 70 వేల కోట్లను పెట్రోల్ డీజిల్ వల్ల వచ్చేదని.. అది నేటికి 3 లక్షల కోట్లకు చేరుకుందని రేవంత్ చెప్పారు. ప్రధాని మోడీ ప్రధాని అయిన నాటి నుంచి 24 లక్షల కోట్లు ఆదాయం పొందారని ఆయన తెలిపారు. స్విస్ బ్యాంకులో దాచిపెట్టిన నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని అబద్ధాలు చెప్పిన ప్రధాని మోడీ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని రేవంత్ మండిపడ్డారు. కరోనా వస్తే.. వ్యాక్సిన్ ఇప్పించలేదని కానీ ఆయన పుట్టినరోజున మాత్రం 2 కోట్ల వ్యాక్సిన్ ఇప్పించారని మండిపడ్డారు. రైల్వేస్టేషన్‌లో ఛాయ్ అమ్మానని ప్రధాని మోడీ చెబుతున్నారని.. కానీ ఆయన టీ అమ్మిన స్టేషన్ కట్టించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు

click me!