భర్త మర్మాంగాన్ని కొడవలితో కోసిన భార్య.... చిత్రహింసలు భరించలేక దారుణం.. !

Published : Sep 22, 2021, 01:00 PM IST
భర్త మర్మాంగాన్ని కొడవలితో కోసిన భార్య.... చిత్రహింసలు భరించలేక దారుణం.. !

సారాంశం

ఈ సంచలన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధిలోని తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే.. భర్త బిచ్యానాయక్ (45) నిత్యం ఏదో ఒక కారణంతో తనను వేధిస్తున్నాడని కోపంతో ఈ దారుణానికి పాల్పడింది అతని భార్య. 

మరిపెడ : మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భర్త పెట్టే బాధలు భరించలేక ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది. పదే పదే తనను చిత్రహింసలు(Harassment) పెడుతుండటంతో భార్య తట్టుకోలేక భర్త మర్మాంగాన్ని(genitals) కోసేసింది. 

ఈ సంచలన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధిలోని తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే.. భర్త బిచ్యానాయక్ (45) నిత్యం ఏదో ఒక కారణంతో తనను వేధిస్తున్నాడని కోపంతో ఈ దారుణానికి పాల్పడింది అతని భార్య. 

అతను గట్టిగా కేకలు వేయడంతో... ఇరుగుపొరుగు వారు వచ్చేసరికి సత్యం రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఇది గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బిచ్యానాయక్ ప్రాణాలు కోల్పోయాడు. 

దామస్తాపూర్ సర్పంచ్ దౌర్జన్యం: ప్రశ్నించినందుకు కాలితో తన్ని, బూతులు తిట్టాడు

కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోజూ గొడవలు, తగాదాలతో విసిగిపోయిన ఆమె మంగళవారం రాత్రి నిద్రపోతున్న తన భర్త మర్మాంగం భాగంలో కొడవలితో కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపడుతున్నామన్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే