కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అందరి జీవితాల్లో వెలుగు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Jun 27, 2022, 5:51 PM IST
Highlights

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు కొందరు సోమవారం నాడు గాంధీభవన్  టీపీససీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆయన  విమర్శించారు. 

హైదరాబాద్:  తెలంగాణలో Congress పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని టీపీసీసీ చీఫ్ Revanth Reddy చెప్పారు. ఉమ్మడి Khammam  జిల్లాకు చెందిన TRS కు చెందిన నేతలు పలువురు సోమవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

KCR సర్కార్ వ్యవహరించిన తీరుపై   తొలిసారిగా Farmers  తిరగబడ్డారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రైతులకు సంకెళ్లు వేసిన ఖమ్మంలో జరిగిందన్నారు.  రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టనున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయాలను Warangal డిక్లరేషన్ లో పొందుపర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.విద్యార్ధులు విద్యకు దూరంగా ఉండకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్నారు.  ఈ పథకం పూర్తిగా అమల్లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని విద్యార్ధులు కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రం వస్దే తమ బతుకులు బాగుపడతాయని  విద్యార్ధులు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 ఏళ్లు దాటినా ప్రభుత్వ  ఉద్యోగ నోటిపికేషన్లను ప్రభుత్వం జారీ చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

 రాష్ట్రంలో సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రతి ఏటా 60 వేల మందిని ఆర్మీ రిక్రూట్ మెంట్ ద్వారా నియమించేవారన్నారు.. ఆర్మీ జవాన్ల నియామకం నిలిపివేశారన్నారు.  అగ్నిపథ్ స్కీమ్ ను తీసుకొచ్చి యువతకు ఉపాధి లేకుండా చేశారని ఆయన విమర్శించారు.

also read:సైనికులకు ఆరు నెలల శిక్షణ ఏం సరిపోతుంది?.. అగ్నిపథ్ తెచ్చి దేశ భద్రతను చీకట్లోకి నెట్టారు: రేవంత్ రెడ్డి

వరంగల్ డిక్లరేషన్ మేరకు ఏక కాలంలో రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 22 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నా కూడా కనీసం ఆ రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అరాచకాలపై పోరాటం చేస్తున్న విద్యార్ధులపై కేసులు పెట్టారన్నారు.  ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నా మంత్రిని భర్తరఫ్ చేయకుండా సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మద్దతుగా నిలిచారని రేవంత్ రెడ్డి విమర్శించారు.రాష్ట్రంలో భూ వివాదాలకు ధరణి పోర్టల్ కారణమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 


 

click me!