బీఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తన ఇద్దరు కూతుళ్లతో వారణాసిలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వారణాసిలోని లాడ్జీలో సత్యమూర్తిని పోలీసులు గుర్తించారు. సత్యమూర్తిని పిల్లలతో కలిసి వికారాబాద్ కు పోలీసులు తీసుకు రానున్నారు.
వికారాబాద్: BSP వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి అదృశ్యమైన ఘటనలో పోలీసులు పురోగతిని సాధించారు. Satyamurthyవారణాసిలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. Varanasi లోని ఓ Lodge లో సత్యమూర్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్నట్టు గా పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా పోలీసులకు 48 గంటల డెడ్ లైన్ విధించిన సత్యమూర్తి అదృశ్యమయ్యారు. సత్యమూర్తి వారణాసిలో ఉన్న విషయాన్ని గుర్తించిన Vikarabad పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 25వ తేదీన సత్యమూర్తి తన ఇంటి నుండి వెళ్లిపోయారు. వికారాబాద్ నుండి వెళ్లిపోయే సమయంలో సత్యమూర్తి ఓ వీడియోను విడుదల చేశాడు. 48 గంటల్లో తన Wife ఆచూకీని చెప్పాలని సత్యమూర్తి పోలీసులకు Dead Line విధించి వెళ్లిపోయాడు. మూడు మాసాల క్రితం సత్యమూర్తి భార్య Annapurna ఇంటి నుండి వెళ్లిపోయింది. Suicide నోట్ రాసి అన్నపూర్ణ ఇంటి నుండి వెళ్లిపోయింది. అన్నపూర్ణ ఎక్కడుందో తన ఆచూకీ తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. తన భార్య అదృశ్యం వెనుక జిల్లాకు చెందిన పెద్దల హస్తం ఉందని సత్యమూర్తి ఆరోపిస్తున్నాడు.ఈ విషయమై తన వద్ద ఆధారాలున్నాయని ఆ వీడియోలో ఆయన చెప్పాడు. తన భార్య ఆచూకీని కనుగొనడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సత్యమూర్తి ఆరోపించారు. ఇదే విషయమై రెండు రోజుల్లో తన భార్య ఆచూకీ తెలపకపోతే తన ఇద్దరు పిల్లలతో కలిసి తాను ఆత్మహత్య చేసుకొంటానని సత్యమూర్తి ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
undefined
ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు సత్యమూర్తి ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించారు. సత్యమూర్తి ఉపయోగించిన కారు Shadnaggar మీదుగా Shamshabad వైపునకు వెళ్లినట్టుగా గుర్తించారు. శంషాబాద్ Airportలో సత్యమూర్తి కారు పార్కింగ్ లో గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబైకి వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే Mumbai ఎయిర్ పోర్టులో CISF సిబ్బందికి వికారాబాద్ పోలీసులు సమాచారం పంపారు.అయితే అప్పటికే ముంబై ఎయిర్ పోర్టు నుండి సత్యమూర్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎయిర్ పోర్టు నుండి వెళ్లిపోయారని గుర్తించారు. ఆ తర్వాత వారణాసికి సత్యమూర్తి వెళ్లినట్టుగా ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించారు. సత్యమూర్తి అద్దెకు తీసుకున్న వాహనం ఆధారంగా సత్యమూర్తి వారణాసిలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వారణాసిలోని లాడ్జీలో సత్యమూర్తి తన ఇద్దరు కూతుళ్లతో ఉన్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారణాసి నుండి సత్యమూర్తిని పోలీసులు వికారారాబాద్ కు తీసుకు రానున్నారు. రేపు సాయంత్రానికి సత్యమూర్తిని వికారాబాద్ కు తీసుకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే సత్యమూర్తి భార్య అన్నపూర్ణ ఆచూకీ లభ్యం కాలేదు. అన్నపూర్ణ సెల్ ఫోన్ వాడినట్టుగా ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. తన భార్య అదృశ్యం కావడానికి జిల్లాకు చెందిన కొందరు పెద్దల హస్తం ఉందనే విషయమై ఆధారాలను సత్యమూర్తి తమకు ఇస్తే వాటి ఆధారంగా విచారణ చేస్తామని కూడా వికారాబాద్ పోలీసులు చెబుతున్నారు.