కేసీఆర్ కాళ్లు పిసికినంత సులభం కాదు: తలసానికి రేవంత్ కౌంటర్

By narsimha lode  |  First Published May 10, 2023, 2:00 PM IST


తనపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కౌంటర్ ఇచ్చారు. 


హైదరాబాద్: కేసీఆర్  కాళ్లు పిసికినంత  సులభం  కాదు  తనను  పిసకడమంటే  అని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఇంకా కూడా  మోజుంటే   ఎప్పుడు రమ్మంటే  ఎక్కడికి రమ్మంటే  అక్కడి వస్తానని  రేవంత్ రెడ్డి  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సవాల్  చేశారు. 

తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ఫైరయ్యారు. నిన్న  తనపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చేసిన విమర్శలపై  రేవంత్ రెడ్డి  కౌంటర్ ఇచ్చారు. బుధవారంనాడు  టీపీసీసీ  చీఫ్  రేవంత్ రెడ్డి  తలసాని  శ్రీనివాస్ యాదవ్ పై  సీరియస్ వ్యాఖ్యలు  చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్  చాలా కాలం పాటు దున్నపోతులు  కాశాడన్నారు. పెండ పిసికి ...పిసికి   పిసుకుతానని  తలసాని వ్రీనివాస్ యాదవ్ అంటున్నారన్నారు.  

Latest Videos

కేసీఆర్, కేటీఆర్ ల  చెప్పులు  మోసినా కూడా  తన మాదిరిగా  ఒక పార్టీకి అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్  అవుతాడా అని  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాన్ పరాగ్ లు తినే  వ్యక్తి కూడా తన గురించి మాట్లాడుతాడా అని తలసాని శ్రీనివాస్ యాదవ్  పై   రేవంత్ రెడ్డి  మండిపడ్డారు. అరటి పండ్ల బండి వద్ద  మేక నమిలినట్టుగా  పాన్ పరాగ్ లు నమిలడం  మానుకోవాలని  ఆయన మంత్రికి హితవు పలికారు.  ప్రజా ప్రతినిధులుగా యువతకు  ఆదర్శంగా ఉండాలని రేవంత్ రెడ్డి  తలసాని శ్రీనివాస్ యాదవ్ కు  సూచించారు . మంత్రిగా ముందు  తన బాధ్యతను గుర్తెరగాలని  రేవంత్ రెడ్డి  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు  హితవు పలికారు. 

అసలు వివాదం ఇదీ

నిన్న కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో స్మశానవాటిక ప్రారంభోత్సవం  సందర్భంగా  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  రేవంత్ రెడ్డి, బీజేపీ  పై  తీవ్ర విమర్శల  చేశారు. యూత్ డిక్లరేషన్ అంశాన్ని ప్రస్తావించారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి    ఇటీవల కాలంలో  బీఆర్ఎస్ నేతలు,  సీఎం కేసీఆర్  , ఇతర మంత్రులపై  విమర్శలు చేయడాన్ని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించారు.  రేవంత్ రెడ్డి  నోటికి అదుపు లేదన్నారు.  ఆ పొట్టొడు  పిసికేస్తే  ప్రాణం పోతదని వ్యాఖ్యానించారు.  తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత సమయంలో అడ్డుకున్నారన్నారు.  కేసులు వేసిన విషయాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రస్తావించారు. ఇప్పుడు  యూఎస్ వైట్ హౌస్ మాదిరిగా  ఉన్న  సచివాలయానికి  ఆ కొడుకులు వస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలపై  కూడా  తలసాని  శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బొట్టు పెట్టుకోవడం బీజేపీ నేతలు తనకు  నేర్పిస్తున్నారన్నారు.  తాను చిన్నప్పటి నుండే బొట్టు పెట్టుకుంటానన్నారు.

click me!