సోమేష్ కుమార్ నిమాయకంపై మండిపడ్డ భట్టి విక్రమార్క...ఆయన ఇంట్రెస్ట్ ఏంటో అంటూ విమర్శలు...

By SumaBala Bukka  |  First Published May 10, 2023, 1:27 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిమాయకం కావడం పట్ల కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. 


హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుల రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నియమితులవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సోమేష్ కుమార్ కు ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అంటూ ప్రశ్నించారు. పదవి విరమణ చేసిన వ్యక్తికి మళ్లీ పదవి ఇవ్వడం ఏమిటంటే ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం సోమేశ్ కుమార్ కి ఇచ్చిన ఆర్డర్ ను చూసి ఆశ్చర్యం వేసిందన్నారు.

మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేశ్ కుమార్ నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  సోమేశ్ కుమార్ ఈ పదవిలో  మూడేళ్లు కొనసాగనున్నట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  అంతేకాదు సోమేష్ కుమార్ కు క్యాబినేట్ హోదా కల్పించారు.

Latest Videos

సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్.. కేబినెట్ హోదా.. ఉత్తర్వులు జారీ..

click me!