‘‘యాత్ర’’ పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. ఎప్పటి నుంచి అంటే..?

By Siva KodatiFirst Published Dec 18, 2022, 6:30 PM IST
Highlights

వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ‘‘యాత్ర’’ పేరుతో పాదయాత్ర చేయనున్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. ‘‘హాత్ సే హాత్ జోడ్ అభియాన్’’ పేరుతో ఆయన యాత్ర నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా.. ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు ఈ యాత్రు చేపట్టాలని ఏఐసీసీ ఇప్పటికే ఆదేశించింది. 

వచ్చే ఏడాది  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తెలంగాణలో  అధికారంలోకి రావాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు వ్యవహరిస్తున్నారు.  సునీల్  సూచనలు, సలహల మేరకు  కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహలు రచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో  కాంగ్రెస్ పార్టీలో కమిటీలు చిచ్చు రేపాయి.

ALso REad: పదవుల కోసం రాలేదు .. కాంగ్రెస్ కష్టంలో వున్నప్పుడే పార్టీలో చేరా: సీనియర్లపై సీతక్క ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో  ఎఐసీసీ ప్రకటించిన  పీసీసీ కమిటీలపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. ఈ కమిటీల్లో  ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు  కాకుండా  ఇతర పార్టీల నుండి వలసవచ్చిన  వారికి  చోటు కల్పించారని  సీనియర్లు  ఆరోపించారు.  నిన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమైన  నేతలు  రేవంత్ రెడ్డి తీరుపై భగ్గుమన్నారు. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో పరిస్థితి మరింత దిగజారింది. సీనియర్ నాయకులు చేసిన కామెంట్స్‌తో కలత చెందిన టీడీపీ బ్యాగ్రౌండ్ ఉన్న 10 మందికి పైగా నేతలు పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేశారు. వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. వారి రాజీనామా లేఖను టీ కాంగ్రెస్ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌కు పంపారు. తమ పదవులను పదవులు రానివారికి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 

రాజీనామా చేసినవారిలో వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారకొండ వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్, సత్తు మల్లేష్.. తదితరులు ఉన్నారు. వీరంతా రేవంత్ రెడ్డి వర్గానికే చెందినవారే. తాము భయపెట్టడానికి కాదని.. పదవులు లేకున్నా పార్టీ కోసం పనిచేస్తామని సీతక్క చెప్పారు. పార్టీ మంచి కోసమే రాజీనామా చేస్తున్నామని తెలిపారు.  ఇదిలా ఉంటే.. మరోవైపు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీకి శనివారం సీఎల్పీ నేత భట్టి  నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు గైర్హాజరయ్యారు. 
 

click me!