అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదు.. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Published : Dec 18, 2022, 06:00 PM IST
అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదు.. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సీనియర్ నేతలు ఉమ్మడి గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సీనియర్ నేతలు ఉమ్మడి గళం వినిపిస్తున్న సంగతి  తెలిసిందే. ఈ పరిణామాలపై ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. తాను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఎవరూ నమ్మలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రండి అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని బయటకు తీయాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసినా.. టీఆర్ఎస్‌కు వేసినా ఒక్కటేనని విమర్శించారు. 

మరోవైపు కేసీఆర్ సర్కార్‌పై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. మునుగోడు ఎన్నికలప్పుడు ఇచ్చిన చండూరు రెవెన్యూ డివిజన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. మద్యం, డబ్బులు ఇచ్చి మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిందని విమర్శించారు. మునుగోడు పరిస్థితి చూసి మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు