వ్యక్తిగత సమస్యలపై చర్చ వద్దు: గాంధీ భవన్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Dec 28, 2022, 11:02 AM IST

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని  ఇవాళ గాంధీ భవన్  లో  పార్టీ పతాకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.  ప్రజా సమస్యలపై చర్చ పెట్టాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. 



హైదరాబాద్: పార్టీలో చిన్న చిన్న సమస్యలుంటాయని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురరస్కరించుకొని  బుధవారం నాడు గాంధీ భవన్ పార్టీ పతకాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.   వ్యక్తిగత సమస్యలపై చర్చ పెట్టొద్దని  రేవంత్ రెడ్డి  కోరారు.  ప్రజా సమస్యలపై చర్చ పెట్టాలని ఆయన సూచించారు.

దేశం కోసం  అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు  తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు.  విదేశీ శక్తుల కుట్రతోనే రాజీవ్ గాంధీ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు.  దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని  ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు  బీజేపీ అడ్డుపడిందని  ఆయన విమర్శించారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  పంచాయితీ రాజ్ మంత్రిగా  ఉన్న జానారెడ్డి స్థానా రెడ్డి  స్థానికసంస్థల్లో మహిళా రిజర్వేషన్ ను  50 శాతానికి పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ కారణంగానే స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Latest Videos

undefined

2004 నుండి  2013 వరకు దేశంలో అధికారంలో  ఉన్న యూపీఏ సర్కార్  దేశ సమగ్రత, సమైక్యత కోసం పాటుపడిందన్నారు. పూర్తి మెజారిటీ ఉన్నా కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు  ఎలాంటి పదవులు  తీసుకోకుండానే  దేశ భద్రతను కాపాడే చర్యలు తీసుకున్నారని  రేవంత్ రెడ్డి  చెప్పారు. 

 స్వాత్రంత్ర్యం రాకముందు  దేశంలో ఎలాంటి పరిస్థితులుండేవో ప్రస్తుతం అదే పరిస్థితులు  కన్పిస్తున్నాయన్నారు. దేశ ప్రజల మధ్య ఆనాడు బ్రిటీష్ పాలకులు కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టేవారన్నారు.  బ్రిటీష్ పాలకులు అవలంభించిన విధానాలనే  బీజేపీ  అవలంభిస్తుందని  రేవంత్ రెడ్డి విమర్శించారు.  మోడీ పాలనలో  రూపాయి పతనమైందన్నారు. అంతర్ఝాతీయంగా  దేశ ప్రతిష్ట మసకబారిందన్నారు.

దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు గాను రాహుల్ గాంధీ  కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు  భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి  చెప్పారు.  దేశం కోసం  మహత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను ఫణంగా  పెట్టారన్నారు.  అదే వారసత్వాన్ని  రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 

also read:బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ: సీబీఐని కోరనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో  రాహుల్ గాంధీ  375 కి.మీ పాదయాత్ర నిర్వహించారన్నారు. గతంలో రాజీవ్ గాంధీ  చార్మినార్ వద్ద జెండా ఆవిష్కరించి  ప్రజల మధ్య  ఘర్షణలకు చెక్ పెడుతూ  యాత్ర చేశారన్నారు. అదే చార్మినార్ వద్ద  రాహుల్ గాంధీ కూడా  జెండా ఆవిష్కరించిన ట్టుగా  రేవంత్ రెడ్డి  చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అభివృద్ది కుంటుపడిందన్నారు. కేసీఆర్ చేతిలో ర్రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేసీఆర్  కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదో  చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు  విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. 

click me!