ఐఎస్ఐ ఉగ్రవాదుల కంటే తీవ్రమైన సెక్షన్లు: చంచల్‌గూడ జైల్లో ఆర్మీ అభ్యర్ధులకు రేవంత్ పరామర్శ

By narsimha lode  |  First Published Jun 24, 2022, 12:38 PM IST


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిపై నమోదు చేసిన నాన్ బెయిలబుల్ కేసును ఉప సంహరించుకోవాలని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 


హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిపై నమోదు చేసిన నాన్ బెయిలబుల్, 307 సెక్షన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన Army  అభ్యర్ధులతో  శుక్రవారం నాడు టీపీసీసీ చీఫ్ Revanth Reddy ములాఖత్ అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  మోడీని నమ్మి యువత BJP కి ఓటేశారన్నారు. కానీ ఆర్మీ రిక్రూట్ మెంట్ లో Agnipath ను తీసుకొచ్చి యువత ఆశలపై నీళ్లు చల్లారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Latest Videos

undefined

also read:నేడు చంచల్‌గూడ జైలుకు రేవంత్ రెడ్డి: సికింద్రాబాద్ విధ్వంసంలో అరెస్టైన అభ్యర్ధులతో ములాఖత్

ప్రతి ఏటా ఆర్మీలో 70 వేల మందిని పాత పద్దతిలో రిక్రూట్ మెంట్ చేసే వారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చట్టాలు, శాసనాలను పక్కన పెట్టి అగ్నిపథ్ ను అమలు చేస్తామంటే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యువతను అడ్డాకూలీలుగా మార్చారని ఆయన విమర్శించారు.కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో యువత  జీవితాన్ని ఫణంగా పెట్టొద్దని ఆయన కోరారు. కరోనా వల్ల రెండేళ్లుగా నియామకాల్లేవని  రేవంత్ రెడ్డి చెప్పారు. 

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిపై ఐఎస్ఐ తీవ్రవాదులపై పెట్టిన కేసులు పెట్టారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసుకు సంబంధించి  అరెస్టైన వారిలో మెజారిటీ పిల్లల పేరేంట్స్ కు  సమాచారం తెలియదన్నారు. కరోనాతో రెండేళ్లుగా ఆర్మీలో రిక్రూట్ మెంట్స్ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఆర్మీ రాత పరీక్ష కోసం  లక్షలు చెల్లించి రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ గుర్తు చేశారు. ఆర్మీ అభ్యర్ధులపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసాన్ని పురస్కరించుకొని హాత్యాయత్నం సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

ఆర్మీ అభ్యర్ధులపై 307 సెక్షన్ కింద ఎలా కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై 307 సెక్షన్ తో పటు నాన్ బెయిలబుల్ కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు.ఆర్మీ అభ్యర్ధులపై పెట్టిన 307 తో పాటు నాన్ బెయిలబుల్ కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

secunderabad రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన ఆర్మీ అభ్యర్ధులపై గోపాలపురం పోలీస్ స్టేషన్ లో  కూడా రెండు కేసులు నమోదు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన  దామెర Rakesh మృతదేహం ఉన్న పాడెను మోసి రాజకీయంగా ఈ ఘటనను వాడుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. Warangal  రైల్వే స్టేషన్ పై టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసిందన్నారు. రాకేష్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చిందన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో  కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసులు పెట్టిందన్నారు.  Narendra Modiకి కేసీఆర్  కూడా తోడ్పాటు ఇచ్చిందని  ఆయన ఆరోపించారు.  Jail  ఉన్న బాధితులందరికీ తాము న్యాయ సహాయం అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి రోజుల్లోనే కేసు విచారణను పూర్తి చేయాాలని ఆయన డిమాండ్ చేశారు.  ఏళ్ల తరబడి  ఈ కేసును సాగదీస్తే ఉద్యోగాలు రాకుండా తీవ్ర ఇబ్బందులు నెలకొనే అవకాశం ఉందన్నారు.  

click me!