టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై ఈడీ కేసు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Apr 2, 2023, 4:39 PM IST

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో  ఈడీ కేసు నమోదు  చేసిందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు.  



హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో  ఈడీ  కేసు నమోదు చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు. అంతేకాదు ఈ విషయమై  ఈడీ కొందరికి  నోటీసులు ఇచ్చినట్టుగా  ఆయన  తెలిపారు.

 ఆదివారంనాడు  గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి  సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఈ వ్యాఖ్యలు  చేశారు.  టీఎస్ పీఎస్‌సీ  పేపర్ లీక్  అంశంలో  ఈడీ విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ  వినతి పత్రం  సమర్పించిన విషయాన్ని ఆయన  ఈ సమావేశంలో గుర్తు  చేశారు.  కాంగ్రెస్ పార్టీ  ఫిర్యాదు  మేరకు  ఈడీ అధికారులు  కేసు నమోదు  చేశారని రేవంత్ రెడ్డి  ఈ సమావేశంలో  తెలిపారు.  అంతేకాదు  కొందరికి నోటీసులు  కూడా ఇచ్చారని  ఆయన  వివరించాచారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.   

Latest Videos

undefined

రెండు  రోజుల క్రితం  ఈడీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి వెళ్లారు.  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశానికి సంబంధించి   ఈడీకి  ఫిర్యాదు  చేశారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీ అధికారులకు  అందించారు.  పేపర్ లీక్ అంశంలో  డబ్బులు  చేతులు  మారాయన్నారు. మనీలాండరింగ్  జరిగిందని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై  కేసు నమోదు  చేయాలని  కోరారు. 

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశంపై   దొరికిన ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా  మలుచుకొనేందుకు  విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే  ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై  విపక్షాలు  విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్,  బీజేపీలు  ఆరోపణలు  చేశాయి.  మంత్రి కేటీఆర్ పీఏ  తిరుపతి   రేవంత్ రెడ్డి ఆరోపణలు  చేశారు.  

also read:పోస్టుకార్డు ఉద్యమం: గాంధీ భవన్ లో ప్రారంభమైన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

ఈ నెల 12, 15, 16 తేదీల్లో  నిర్వహించాల్సిన రెండు పరీక్షలను  టీఎస్‌పీఎస్ సీ వాయిదా వేసింది.  టీఎస్‌పీఎస్‌సీ  కార్యాలయంలోని కంప్యూటర్లు  హ్యాక్ అయ్యాయని  సమాచారంతో ఈ రెండు  పరీక్షలను  వాయిదా వేశారు.ఈ విషయమై  విచారణ   నిర్వహించిన  పోలీసులు   పేపర్ లీక్   జరిగిందని నిర్ధారించారు. 

ఈ పేపర్ లీక్ అంశంపై  విచారణను  సిట్ అప్పగించింది  ప్రభుత్వం.  ఏఆర్ శ్రీనివాస్  నేతృత్ంలోని సిట్ బృందం  ఈ కేసును విచారిస్తుంది.   ఈ కేసులో  ఇప్పటికే  13 మందిని  సిట్  బృందం  అరెస్ట్  చేసింది.   ఈ కేసు విచారణలో  సిట్   విచారణలో  రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది.   పేపర్ లీక్ అంశానికి  సంబంధించి  టీఎస్‌పీఎస్‌సీ పాలకవర్గ సభ్యులను  కూడా  సిట్  విచారిస్తుంది.

click me!