కేసీఆర్ దోపిడీని ఇంకెంత కాలం భరిద్దాం.. కాంగ్రెస్‌ వస్తేనే బతులు మారేది : ప్రవాసులతో రేవంత్ రెడ్డి

By Siva Kodati  |  First Published Jun 3, 2023, 2:24 PM IST

అన్నివర్గాల పోరాటాలు, త్యాగంతోనే తెలంగాణ వచ్చిందని.. కానీ కేసీఆర్ కుటుంబమే తొమ్మిదేళ్లుగా పాలిస్తూ అక్రమాలకు పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ దోపిడీని ఇంకెంతకాలం భరిద్దామని రేవంత్ ప్రశ్నించారు.


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ఇన్నేళ్లలో రూ.17 లక్షల కోట్లను బడ్జెట్‌లో చూపారని, మరో 5 కోట్లు అప్పులు కలిపి మొత్తం రూ.22 లక్షల కోట్లని.. అంత డబ్బు ఖర్చు చేసినప్పుడు తెలంగాణ ప్రజల జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని రేవంత్ రెడ్డి ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. 

కేసీఆర్ దోపిడీని ఇంకెంతకాలం భరిద్దామని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. అన్నివర్గాల పోరాటాలు, త్యాగంతోనే తెలంగాణ వచ్చిందని.. కానీ కేసీఆర్ కుటుంబమే తొమ్మిదేళ్లుగా పాలిస్తూ అక్రమాలకు పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Latest Videos

ALso Read: రేవంత్ రెడ్డి మాదిరిగా పార్టీలు మారడం చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

అంతకుముందు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రేవంత్ రెడ్డి మాదిరిగా  పార్టీలు మారడం తను చేతకాదన్నారు. ఓటుకు  నోటు కేసులో  డబ్బు సంపాదించడం చేతకాదన్నారు. రేవంత్ రెడ్డి  పార్టీని ఎలా నడుపుతున్నారో జగ్గారెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని  అడిగితే  తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో  అందరికి తెలుసునన్నారు. స్వంత  పార్టీ నేతలపై  విమర్శలు చేయడం తనకు చేతకాదని  రేవంత్ రెడ్డి పై  బండి సంజయ్  విమర్శలు  చేశారు. హుజూరాబాద్ , దుబ్బాక, జీహెచ్ఎంసీ  , ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని  ఆయన గుర్తు  చేశారు. పార్టీ నడపకుంటే ఎలా గెలుస్తామని  ఆయన  ప్రశ్నించారు. బీజేపీలో  సీనియర్‌లే బాస్‌లని , కానీ కాంగ్రెస్‌లో వారు హోంగార్డులని సంజయ్ ఎద్దేవా  చేశారు. 


 

click me!