తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుంది. ఐదురాష్ట్రాలలో ప్రస్తుత శాసన సభల గడువు వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం... ఆ తేదీలను విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించింది.
ఢిల్లీ : ఐదురాష్ట్రాలలో ప్రస్తుత శాసన సభల గడువు వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం... ఆ తేదీలను విడుదల చేస్తూ ఎన్నికల ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించింది. ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల సీఎస్, సీఈఓలకు భారత ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు జారీచేసింది.
ఈ ఐదు రాష్ట్రాల్లో శాసనసభల చివరి తేదీలు ఇవే..
మిజోరాం 17.12.23
చత్తీస్గఢ్ 03.01.24
మధ్యప్రదేశ్ 06.01.24
రాజస్థాన్ 14.01.24
తెలంగాణ 16.01.24
వీటికి ముందే ఎన్నికలే నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి..శుక్రవారం ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
ఇదిలా ఉండగా, శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల సీఎస్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో మూడేళ్లు దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది.
వీటితో పాటు కీలక స్థానాల్లో వున్న పోలీస్, రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని సూచించింది. అంతేకాదు.. ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లకు కూడా వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశించింది. ఈమేరకు ఈ బదిలీల ప్రక్రియను జూలై 31 లోపు పూర్తి చేసి, నివేదిక ఇవ్వాలని సూచించింది.
ఆయా రాష్ట్రాల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్ధులతో బంధుత్వాలు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని తెలిపింది. ఎన్నికల విధులకు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులను దూరంగా వుంచాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. గతంలో ఈసీ చర్యలు తీసుకున్న వ్యక్తులను కూడా విధులకు దూరంగా వుంచాలని ఆదేశించింది.