ఔటర్ రింగ్ రోడ్డు లీజు: సమాచారం ఇవ్వలేదని హెచ్ఎండీఏపై హైకోర్టులో రేవంత్ పిటిషన్

Google News Follow Us

సారాంశం


ఔటర్ రింగ్ రోడ్డును  30 ఏళ్లకు ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇవ్వడంపై  తాను అడిగిన సమాచారం ఇవ్వకపోవడంపై  హెచ్ఎండీఏ కోర్టును ఆశ్రయించారు రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు  ను 30 ఏళ్లకు ప్రైవేట్ సంస్థకు లీజు ఇవ్వడంపై  హెచ్ఎండీఏ సరైన సమాచారం ఇవ్వడం లేదని  తెలంగాణ హైకోర్టులో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  బుధవారంనాడు  పిటిషన్ దాఖలు చేశారు.

ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇవ్వడంపై సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి  హెచ్ఎండీఏ అధికారులకు  ఆర్టీఐ కింద  సమాచారం కోరారు. అయితే  ఈ విషయమై తాను అడిగిన సమాచారం ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.హెచ్ఎండీఏ, హైద్రాబాద్ గ్రోత్ కారిడార్ ను ప్రతివాదులుగా  రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీఐ కింద తాను  అడిగిన సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోరారు.

ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టును ఐఆర్‌బీ సంస్థకు కేటాయించడం నిబంధనలకు విరుద్దంగా జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  రూ. 1 లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును  రూ. 7 వేల కోట్లకు తెగనమ్మారని  ఆయన రేవంత్ రెడ్డి  ఆరోపణలు చేశారు.

ఈ విషయమై  రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు కూడ ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావులు  ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు  ఐఆర్‌బీ సంస్థ ఈ ఏడాది మే  29న  లీగల్ నోటీస్ పంపింది.  రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే ఓఆర్ఆర్ లీజు: రేవంత్ రెడ్డి

ఔటర్ రింగ్  రోడ్డు   లీజ్ విషయంలో  హెచ్ఎండీఏపై  రేవంత్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలపై  ఆయనకు  హెచ్ఎండీఏ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ విషయమై  ఈడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు  చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం వంటిదే  ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహరమని  రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ను ఈడీ, సీబీఐలు విచారిస్తున్నాయన్నారు.  ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయాన్ని ఈడీతో విచారణ  చేయించాలని  ఆయన కోరారు.