ఓఆర్ఆర్‌పై లీగల్ నోటీసు వెనక్కు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Jun 13, 2023, 3:20 PM IST

హైద్రాబాద్ ఓఆర్ఆర్ లీజు విషయంలో ఐఎఎస్ అధికారి  అరవింద్ కుమార్   ఇచ్చిన లీగల్ నోటీసు వెనక్కు తీసుకోవాలని రేవంత్ రెడ్డి  కోరారు.


హైదరాబాద్: ఓఆర్ఆర్ లీజు  విషయమై  చేసిన ఆరోపణలపై హెచ్ఎండీఏ  పంపిన  లీగల్ నోటీసులకు టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి   వివరణ ఇచ్చారు. తనకు  లీగల్ నోటీసిచ్చిన  ఐఎఎస్ అధికారి  అరవింద్ కుమార్ నోటీసును వెనక్కు తీసుకోవాలని కోరారు.    ఐఎఎస్ అధికారి  అరవింద్ కుమార్  రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని ఆయన  ఆరోపించారు ఓఆర్ఆర్  లీజు విషయంలో తాను  అడిగిన సమాచారం ఇంతవరకు  ఇవ్వలేదన్నారు.

ఔటర్ రింగ్  రోడ్డు ను  ప్రైవేట్ సంస్థకు 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడంపై  హెచ్ఎండీఏపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఆరోపణలు  చేశారు. ఈ ఆరోపణలపై  రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ  లీగల్ నోటీసులు పంపింది.  ఈ లీగల్ నోటీసులకు  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  మంగళవారంనాడు వివరణ ఇచ్చారు.

Latest Videos

undefined

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే ఓఆర్ఆర్ లీజు: రేవంత్ రెడ్డి

ఐఎఎస్ అధికారి  ఇచ్చిన లీగల్ నోటీసు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు.అరవింద్ కుమార్  పంపిన  లీగల్ నోటీస్  ప్రజాస్వామ్య స్పూర్తికి  విరుద్దమన్నారు.
లీగల్ నోటీసులో  పేర్కొన్న  ఆరోపణలన్నీ  బూటకమన్నారు.ఐఆర్ బీకి టెండర్ కట్టబెట్టే  క్రమంలో  నిబంధనలు ఉల్లంఘన .జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఓఆర్ఆర్ పై ట్రాఫిక్  టెండర్ మదింపు నివేదిక  పబ్లిక్ డొమైన్ లో లేదన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా  ప్రజల తరపున  పోరాటం  చేస్తూనే ఉంటానని రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు.

ఔటర్ రింగ్  రోడ్డు  ను  ఐఆర్ బీకి  హెచ్ఎండీఏ  30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఈ  లీజు విషయంలో  నిబంధనలను ఉల్లంఘించారని  కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించాయి.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ ఆరోపణలు  చేశారు.  ఓఆర్ఆర్ లీజు విషయంలో  రేవంత్ రెడ్డి  పలు  ఆరోపణలు  చేశారు.  మంత్రి కేటీఆర్,  ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ పై  ఆరోపణలు  చేశారు. ఈ లీజు విషయంలో  మంత్రి కేటీఆర్ స్పందించాలని  ఆయన డిమాండ్  చేశారు. 

click me!