మోడీని ఫేస్‌ టూ ఫేస్ నిలదీయొచ్చుగా.. నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరణ ఎందుకు: కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు

Siva Kodati |  
Published : Aug 06, 2022, 06:56 PM IST
మోడీని ఫేస్‌ టూ ఫేస్ నిలదీయొచ్చుగా.. నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరణ ఎందుకు: కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు

సారాంశం

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ప్రధానిని నిలదీయడానికి వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకోవాలని రేవంత్ సూచించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్‌పై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానని కేసీఆర్ చెప్పారని, దీనిని బట్టి నరేంద్ర మోడీ, కేసీఆర్ మధ్య జరిగిన చీకటి ఒప్పందం మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. చాలా సందర్భాలలో నీతి ఆయోగ్ సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి హాజరుకాని పక్షంలో వారి తరపున మంత్రులను పంపిస్తారని రేవంత్ గుర్తుచేశారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎందుకు బహిష్కరించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతారని భావించామని... ప్రధానిని ముఖాముఖిగా ప్రశ్నించే అవకాశం వుండేది కదా అని ఆయన అన్నారు. 

జీఎస్టీ బిల్లు తెచ్చినప్పుడు మోడీని కేసీఆర్ పొగిడారంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ఏడున్నరేళ్లుగా కేసీఆర్.. మోడీతో కలిసి నడిచారని ఆయన గుర్తుచేశారు. మాటలు వ్యతిరేకంగా కనిపిస్తున్నా.. చర్యలు మోడీకి అనుకూలంగా వున్నాయని రేవంత్ దుయ్యబట్టారు. కేంద్రంలో ఈడీలాగే , ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ను తన వ్యతిరేకులపై కేసీఆర్ ప్రయోగిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు.  మోడీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడని రేవంత్ అన్నారు. తెలంగాణలో దర్యాప్తు , నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. నీతి ఆయోగ్ మీటింగ్‌కు కేసీఆర్ స్వయంగా హాజరుకావాలని రేవంత్ సూచించారు. ప్రధానిని నిలదీయడానికి వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకోవాలని రేవంత్ సూచించారు. 

Also REad:రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. కేసీఆర్ కీలక ప్రకటన

అంతకుముందు శనివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం వైఖరిపై నిరసన తెలియజేయడానికి దీనిని ఉత్తమైన మార్గంగా భావిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. బహిరంగ లేఖ ద్వారా ప్రధాని మోదీకి తనన నిరసనను నేరుగా తెలియజేయనున్నట్టుగా తెలిపారు.  

బీజేపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిందన్నారు. నీతి ఆయోగ్‌తో దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించామని చెప్పారు. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ నిరర్దక సంస్థగా మారిందని విమర్శించారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది జరిగిందని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులు 13 నెలల పాటు పోరాటం చేశారని గుర్తుచేశారు. రైతులు పోరాటం చేయకముందే.. 13 రోజుల్లో చట్టాలను రద్దు చేసి ఉండొచ్చు కదా అని  కామెంట్ చేశారు. దేశంలో ద్వేషం, అసహనం పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్