చేనేత రంగంపై కూడా మోదీ సర్కార్ కక్ష కట్టింది: పీయూష్ గోయల్‌కు కేటీఆర్ లేఖ

Published : Aug 06, 2022, 06:26 PM IST
చేనేత రంగంపై కూడా మోదీ సర్కార్ కక్ష కట్టింది: పీయూష్ గోయల్‌కు కేటీఆర్ లేఖ

సారాంశం

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్‌ రంగంపై మోదీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తత ఉందని కేటీఆర్ లేఖలో విమర్శించారు. 

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్‌ రంగంపై మోదీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తత ఉందని కేటీఆర్ లేఖలో విమర్శించారు. శుష్క వాగ్ధానాలు – రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు తెలంగాణ నేతలన్న కడుపు కొడుతోందని మండిపడ్డారు. చేనేతపై జీఎస్టీ అనాలోచిత నిర్ణయమని తప్పుబట్టారు. తెలంగాణ చేనేత రంగానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారానికి సంబంధించిన వివరాలను కేటీఆర్ లేఖలో పొందుపరిచారు. చేనేత, జౌళి రంగాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

గత 8 ఏళ్లుగా టెక్స్‌టైల్ రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని చెప్పారు. దేశంలోని ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోదీ ప్రభుత్వం.. టెక్స్‌టైల్, చేనేతరంగంపై కూడా కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్‌ పార్క్ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేంద్రం సహాయం ఎక్కడ అని ప్రశ్నించారు. రూ.1,552కోట్ల తెలంగాణ ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో కేంద్రం తరఫున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే, ఇప్పటివరకు స్పందించని బీజేపీ ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందుక సంబంధించి ఎన్ని సార్లు కోరినా.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. 

బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు అనేక చిన్న దేశాలు టెక్స్‌టైల్ రంగంలో మనకంటే ఎక్కువగా వృద్ధిని నమోదు చేస్తున్నాయన్న కేటీఆర్.. ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాల లేమినే కారణమన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పవర్ లూమ్ మగ్గాలు ఉన్న సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరితే.. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. 

యాదాద్రి, గద్వాల, నారాయణ్‌పేట, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్ వంటి జిల్లాల్లో అత్యంత నైపుణ్యం కల సుమారు 40వేల మంది చేనేత కార్మికులు ఉన్నారని  చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ఇక్కత్, గొల్లభామ వంటి చీరలకు తెలంగాణ నెలవుగా ఉందని  గుర్తుచేశారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లినందున అదే ఇన్‌స్టిట్యూట్‌ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం స్పందిచలేదని కేటీఆర్ విమర్శించారు. 

దేశంలోని చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ ఆగస్టు 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఈ జీఎస్టీ పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పవర్ లూమ్ మగ్గాల అప్‌గ్రేడేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 50శాతం నిధులను భరించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఇందుకు సంబంధించిన కేంద్రం నిధుల కోసం కేంద్రాన్ని కోరితే స్పందన లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణలోని మరమగ్గాల అప్ గ్రేడేషన్ కొసం వేంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?