జైలుకెళ్లి వచ్చాడన్నా.. సైలెంట్‌గానే వున్నా: కోమటిరెడ్డి వ్యవహారంపై జగ్గారెడ్డితో రేవంత్ సంభాషణ

By Siva KodatiFirst Published Aug 14, 2021, 9:17 PM IST
Highlights

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కోమటిరెడ్డి ఇష్యూనీ సెటిల్ చేసుకుంటే మంచిదని జగ్గారెడ్డి సూచించారు. కోమటిరెడ్డిని ఇబ్బంది పెట్టకుండానే చేవేళ్ల నియోజకవర్గంలో సభ పెట్టామని రేవంత్ తెలిపారు. 

టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి సభ సక్సెస్ అవ్వడంపై కార్యకర్తలకు ధన్యవాద తీర్మానం ఆమోదించారు. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కోమటిరెడ్డి ఇష్యూనీ సెటిల్ చేసుకుంటే మంచిదని జగ్గారెడ్డి సూచించారు. కోమటిరెడ్డిని ఇబ్బంది పెట్టకుండానే చేవేళ్ల నియోజకవర్గంలో సభ పెట్టామని రేవంత్ తెలిపారు.

అలాగే మాణిక్యం ఠాగూర్‌పైనా కోమటిరెడ్డి ఆరోపణలు చేశారని ఆయన వెల్లడించారు. తనను జైలుకెళ్లి వచ్చాడన్నా.. సైలెంట్‌గానే వున్నానని రేవంత్ తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇది సహజమన్నారు జగ్గారెడ్డి. రాజీవ్ గాంధీని తిట్టిన జైపాల్‌రెడ్డే పదేళ్లు కేంద్రమంత్రిగా వున్నారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న రేవంత్ రెడ్డి.. మిమ్మల్ని కూడా నువ్వు జైలుకెళ్లి వచ్చావు అంటే కోపం రాదా అని జగ్గారెడ్డిని ప్రశ్నించారు. పాస్‌పోర్ట్‌ కేసులో తనను ఇరికించిన సంగతి అందరికీ తెలిసిందేనని జగ్గారెడ్డి చెప్పారు. రావిరాల సభను కలిసికట్టుగా విజయవంతం చేద్దామని రేవంత్ నేతలను కోరారు. 

Also Read:దళిత గిరిజన దండోరా: కోమటిరెడ్డి అలక.. ఇబ్రహీంపట్నానికి బదులు మహేశ్వరానికి మారిన వేదిక

కాగా, తనకు చెప్పకుండా ఇబ్రహీంపట్నంలో దళిత గిరిజన దండోనా సభ నిర్వహించడంపై టీ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలకబూనారు. పార్లమెంటరీ కమిటీ పర్యటన ఉన్నందున ఈనెల 18న నిర్వహించనున్న సభకు హాజరుకాలేనని తెలియజేశారు. సాధ్యమైనంత వరకు సభను వాయిదా వేసుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సభ వేదికను ఇబ్రహీంపట్నం నుంచి మహేశ్వరానికి మారుస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది.

click me!