దళితబంధు: తేడా వస్తే టీఆర్ఎస్‌కు ఓటమి తథ్యం.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 14, 2021, 7:57 PM IST
Highlights

దళితబంధు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేకపోవచ్చని శ్రీహరి అభిప్రాయపడ్డారు. దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయన హెచ్చరించారు.

టీఆర్‌ఎస్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దళిత బంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమని ఆయన అన్నారు. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేకపోవచ్చని శ్రీహరి అభిప్రాయపడ్డారు. దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కడియం శ్రీహరి హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అంతకుముందు హుజురాబాద్‌లోని ప్రతి కుటుంబానికి దళిత బంధును నూటికి నూరు శాతం అందజేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. శనివారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎటువంటి చెప్పుడు మాటలు వినొద్దని, అనుమానాలు, అపోహాలకు తావు లేదని తెలిపారు. రైతు బంధు కార్యక్రమాన్ని కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోనే కేసీఆర్ ప్రారంభించారని హరీశ్ రావు గుర్తుచేశారు.

Also Read:దళిత బంధు అందరికీ ఇవ్వాలి.. లేకుంటే ఉద్యమమే: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరిక

ఆ సమయంలో కూడా ఇది కొద్దిమందికే వస్తుందని కొందరు.. వున్నత వర్గాలకే వస్తుందని మరికొందరు, ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కానీ రైతు బంధు నిరాటంకంగా, కరోనా సమయంలోనూ కొనసాగుతోందని చెప్పారు. ఇదే రైతు బంధుని హుజురాబాద్‌లో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులే .. ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని మండిపడ్డారు.

click me!