దళిత బంధు కింద రూ.12 లక్షలు.. పీజీ పాసైతే రూ. లక్ష సాయం : కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు

By Siva KodatiFirst Published Aug 26, 2023, 6:56 PM IST
Highlights

చేవేళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభ సందర్భంగా దళిత, గిరిజన డిక్లరేషన్‌ను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

చేవేళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభ సందర్భంగా దళిత, గిరిజన డిక్లరేషన్‌ను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి చేవేళ్ల గడ్డ నుంచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామన్నారు. సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని రేవంత్ చెప్పారు. కేసీఆర్ చేతిలో దళితులు, గిరిజనులు మోసపోయారని దుయ్యబట్టారు. 

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని కీలకాంశాలు :

  • అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలతో దళిత బంధు
  • ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు
  • ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పోరేషన్ల చొప్పున ఏర్పాటు
  • రాష్ట్రంలో కొత్తగా 5 ఐటీడీఏలు ఏర్పాటు
  • కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్న అసైన్డ్ భూములు వెనక్కి ఇచ్చేలా హామీ
  • అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు 
  • టెన్త్ పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.10 వేలు
  • ఇంటర్ పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ. 15 వేలు
  • డిగ్రీ పాసైన దళిత, గిరిజన విద్యార్ధులకు రూ.25 వేలు
  • పీజీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు  రూ.లక్ష
  • పోడు భూములకు పట్టాలిస్తాం
  • ప్రతి మండలంలో గురుకుల పాఠశాల
  • గ్రాడ్యుయేషన్ , పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు వసతి 
click me!