
హైదరాబాద్: 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు సినిమాలకు అవార్డులు దక్కాయి. తొలిసారి ఓ తెలుగు నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అవార్డు దక్కించుకున్న వారిపై ప్రశంసలు కురిపించారు. జాతీయ ఉత్తమ నటుడిగా తొలిసారిగా తెలుగు నటుడు అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉన్నదని తెలిపారు.
జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా పలు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఈ సందర్భంగా అవార్డులు దక్కించుకున్న పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన సినిమా బృందాలనూ అభినందించారు. అవార్డులు గెలుచుకున్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
Also Read: అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు.. వివరాలివే
ఆర్ఆర్ఆర్ సినిమా ఆరు అవార్డులను దక్కించుకోవడం గమనార్హం. మొత్తంగా తెలుగు సినిమాకు 11 అవార్డులు దక్కయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్‌కు సినిమా విడుదలైనప్పుడే చాలా మంది మెచ్చుకున్నారు. మార్కులు వేశారు. సుకుమార్ డైరెక్షన్‌పైనా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే మన ముందుకు రానుంది.