సోనియమ్మ ఎలా చెబితే అలా...

Published : Oct 07, 2017, 04:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
సోనియమ్మ ఎలా చెబితే అలా...

సారాంశం

పిసిసి అధ్యక్షుడి నియామకంలో నియామకంలో గాంధీకే అధికారం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని , ఏఐసీసీ పదవుల బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ కి అప్పగిస్తూ తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసింది.  తీర్మానాన్ని నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు  దానం నాగేందర్ ప్రవేశపెట్టారు.  కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మృత్యుంజయం, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ పొన్నం, మహేష్ గౌడ్ తదితరులు బలపరిచారు. పార్టీలో పిసిసి పీఠం కోసం తీవ్రమయిన పోటీ ఉంది. పిసిసి అధ్యక్ష పదవి కావాలని కోమటిరెడ్డి వేంకటరెడ్డి బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ నాయకత్వంలో పనిచేసేదే లేదని కూడా అన్నారు. ఇక ఇతర నాయకులలో  గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుు డు వి హనుమంతరావు, శాసన  మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు పోటీ పడుతున్నారు. అందువల్ల అధ్యక్షుడిగా పార్టీ నాయకత్వం ఎవరిని నియమించినా పర్వాలేదన్నట్లు ఈ రోజు తీర్మానం చేయాల్సి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu